- Telugu News Photo Gallery Jaggery Health Benefits: This superfood sweetener is better for your health than sugar
Jaggery: జుట్టు విపరీతంగా రాలిపోతున్నవారికి అద్భుత ఔషధం.. రోజుకో చిన్న ముక్క నోట్లో వేసుకుని..
చక్కెరతో తయారు చేసిన పదార్ధాల కంటే బెల్లం తింటే ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మన పూర్వికుల కాలం నుంచేకాకుండా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాల్లోనూ బెల్లానికి ప్రత్యేక విశిష్టత ఉంది. కేవలం పండగలకు చేసే పిండివంటల్లో మినహా దాని వాడకమే కనిపించడం లేదు. ఈ బెల్లంలో ఉండే పోషకాలు..
Updated on: Apr 23, 2023 | 10:49 AM

చక్కెరతో తయారు చేసిన పదార్ధాల కంటే బెల్లం తింటే ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మన పూర్వికుల కాలం నుంచేకాకుండా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాల్లోనూ బెల్లానికి ప్రత్యేక విశిష్టత ఉంది. కేవలం పండగలకు చేసే పిండివంటల్లో మినహా దాని వాడకమే కనిపించడం లేదు. ఈ బెల్లంలో ఉండే పోషకాలు, కలిగే ప్రయోజనాలు నిపుణుల మాటల్లో మీకోసం..

కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి మినరల్స్‌తో పాటు బి కాంప్లెక్సు, సి, బి2, ఈ.. వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. బెల్లానికి నువ్వులను కలిపి తింటే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. వేరుశనగపప్పులో కలిపి తింటే బలం పెరుగడమేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

రోజూ కొంచెం బెల్లం తింటే అజీర్తి, మలబద్దకం, నెలసరిలో చిక్కులు, రక్తహీనత లాంటి వాటిని ఇట్టే మటుమాయం అవుతాయి. పెద్దలకు అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తి అందించి నీరసం పారదోలుతుంది.

కడుపులో మంట, ఎసిడిటీ లాంటి సమస్యలను అధిగమించడానికి ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలు. బెల్లం సొంపుతో కలిపి తింటే నోటి దుర్వాసన పోతుంది.

జుట్టు విపరీతంగా రాలిపోతున్నట్లయితే గుప్పెడు మెంతుల్లో, కాసింత బెల్లం కలిపి రోజూ తింటే వెంట్రుకల కుదుళ్లు దృఢంగా మారుతాయి. తెల్లజుట్టు రాకుండా నివారిస్తుంది కూడా.





























