Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అలాంటి వారిని కనిపించిన వెంటనే కాల్చి చంపాలి’.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల యూపీలో హత్యకు గురైనా గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నవారిని కనిపించగానే కాల్చి చంపాలని కేంద్ర మంత్రి అశ్విని చౌబే శనివారం (ఏప్రిల్‌ 22) వ్యాఖ్యానించారు. పాట్నా జిల్లాలో జుమ్మా నమాజ్ చేసిన తర్వాత, వారిలో ఓ వ్యక్తి 'అతిక్ అహ్మద్ అమర్ రహే' అని ఓ వ్యక్తి అతిక్‌కు మద్దతుగా..

'అలాంటి వారిని కనిపించిన వెంటనే కాల్చి చంపాలి'.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Union Minister Ashwini Choubey
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 23, 2023 | 2:42 PM

ఇటీవల యూపీలో హత్యకు గురైనా గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నవారిని కనిపించగానే కాల్చి చంపాలని కేంద్ర మంత్రి అశ్విని చౌబే శనివారం (ఏప్రిల్‌ 22) వ్యాఖ్యానించారు. పాట్నా జిల్లాలో జుమ్మా నమాజ్ చేసిన తర్వాత, వారిలో ఓ వ్యక్తి ‘అతిక్ అహ్మద్ అమర్ రహే’ అని ఓ వ్యక్తి అతిక్‌కు మద్దతుగా నినాదాలు చేశాడు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా చేసినట్లు పాట్నా సిటీ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు. ఈ సంఘటనపై చౌబే స్పందిస్తూ.. ‘ఈ సంఘటన విచారకరం. బీహార్‌లో ఇటువంటి ప్రకటనలు, నినాదాలు చేయడం దురదృష్టకరం. అలాంటి వారిని వెంటనే కాల్చివేయాలి. దేశ ప్రధానికి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వారి పేర్లతో నినాదాలు చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరం’ అని చౌబే అన్నారు.

అనంతరం బీహార్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. బీహార్‌లో కేవలం మామ-మేనల్లుడి వంశం, కులవివక్ష ప్రభుత్వం నడుస్తోంది. బీజేపీని టార్గెట్ చేస్తూ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటనలు చేస్తున్నారు. 2025 ఎన్నికల్లో యోగి మోడల్‌ను ఎంచుకుని ప్రజలే వారికి తగిన రీతిలో సమాధానం చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీహార్ ప్రజలు యోగి మోడల్‌ను అధికారంలోకి తీసుకువస్తారని, బీహార్‌లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. కాగా అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి పోలీసు సిబ్బంది ఎస్కార్ట్ చేస్తున్న సమయంలో ఏప్రిల్ 15 రాత్రి ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య, ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎస్పీ నేత హత్యకేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ హత్య కేసుల్లో అతిక్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.