Weather: కాస్త ఎండల నుంచి ఉపశమనం.. చల్లని వార్త చెప్పిన వాతావరణ శాఖ
దేశంలో వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. అలాగే వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత వాతావరణ విభాగం దేశ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే విషయాన్ని వెల్లడించింది.
దేశంలో వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. అలాగే వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత వాతావరణ విభాగం దేశ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే విషయాన్ని వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వడగాలులు వీసేందుకు అవకాశాలు లేవని అంచనా వేసింది.
తమిళనాడు, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడనుందని పేర్కొంది. అయితే దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లోని ఆకాశం మేఘావృతమై ఉంటుందని…అలాగే పలు చోట్ల వర్షాలు కూడా కురస్తాయని తెలిపింది. మొత్తానికి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్,దక్షిణ కర్ణాటక బిహార్, పంజాబ్, రాష్టాల్లో ఉరుములతో కూడిన గాలి వానలు కురుస్తాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ అయిన స్కైమెట్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.