Nimisha Priya Case: నిమిషా కేసులో బిగ్ ట్విస్ట్.. బ్లడ్ మనీకి ఒప్పుకోని బాధిత కుటుంబం.. నెక్స్ట్ ఏం జరగనుంది..?
యెమెన్‌లో కేరళ నర్సు నిమిషకు ఉరిశిక్ష వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మృతుడు తలాల్ కుటుంబం బ్లడ్ మనీ ఆఫర్‌ను తిరస్కరించింది. నిమిషను బాధితురాలిగా కాకుండా దోషిగా చూడాలని తలాల్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. కేరళ మతపెద్ద అబూ బాకర్ యెమెన్ అధికారులతో పాటు బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు.

యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లిస్తామన్న నిమిష కుటుంబం ఆఫర్‌ను తిరస్కరించారు. డబ్బుతో రక్తాన్ని కొనలేరని బాధితుడు తలాల్ కుటుంబం అంటోంది. మరోవైపు నిమిష ఉరిశిక్ష వాయిదా పడడంతో స్వల్ప ఊరట లభించింది. వాస్తవానికి ఇవాళ ఆమెకు ఉరిశిక్ష అమలుకావాల్సి ఉంది. అయితే కేరళ మతపెద్ద అబూ బాకర్ జోక్యంతో ఉరి వాయిదా పడింది. యెమెన్‌లో హూతీ ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని అబూ బాకర్ ప్రకటించారు. నిమిషా ప్రియను కాపాడేందుకు బాధితుడి కుటుంబానికి 8 కోట్ల 60 లక్షల రూపాయలు బ్లడ్ మనీగా ప్రియ కుటుంబం అందించేందుకు సిద్దమయ్యింది. కాని వాళ్లు అందుకు ఒప్పుకోవడం లేదు.
మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం నిమిషాకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది స్పష్టంచేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్‌మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని అన్నారు. న్యాయం దక్కాల్సిందే అన్నారు. . అలాగే దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించారు.
ఈ విషయానికి సంబంధించి నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కోర్ కమిటీ సభ్యుడు దినేష్ నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిమిషా ప్రియకు క్షమాపణను పొందడానికి కౌన్సిల్ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని తెలిపాడు. ‘‘బాధితురాలి కుటుంబంతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. క్షమాపణ కోసం పెద్ద మొత్తంలో బ్లడ్ మనీ ఏర్పాటు చేశాం. అయితే, బాధితురాలి కుటుంబం దీన్ని తీసుకోవడానికి నిరాకరించింది’’ అని నాయర్ చెప్పారు. అయితే కౌన్సిల్ ప్రయత్నాలు కొనసాగుతాయని, నిమిషా ప్రియ విడుదలకు సాధ్యమయ్యే అన్ని మార్గాలను అన్వేషిస్తామని నాయర్ స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రం కూడా నిమిషా ఉరిని ఆపేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ జైలు అధికారులతోపాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. సుప్రీం కోర్టుకు కూడా ఇదే విషయాన్ని తెలిపింది. తాము అన్నీ ప్రయత్నాలు చేశామని.. ఇప్పడు బాధితుడి కుటుంబం నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉందని కేంద్రం కోర్టుకు తెలిపింది.
తన వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మహదీని హత్య చేసినట్లు నిమిషాపై ఆరోపణలు ఉన్నాయి. అతని మృతదేహం 2017లో నీటి ట్యాంక్‌లో లభ్యమైంది. తలాల్ తనను దోపిడీ చేశాడని నిమిషా ఆరోపించారు. అతని వద్ద నా పాస్ట్ పోర్టు ఉండడంతో తిరిగి తీసుకోవడానికి ఇచ్చిన మత్తు మందు అధిక మోతాదు కావడం వల్ల అతడు చనిపోయాడని తెలిపింది. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్ల దాదాపు రూ.8.6కోట్ల క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే.. నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. బ్లడ్‌మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
