AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందం కోసం ప్రాణాలతో పందెం..! పక్కటెముకలను తొలగించుకోబోతున్న మహిళ..

ప్రస్తుతం చేయించుకోబోయే ఈ సర్జరీ ఆమెకు ఆరవది అవుతుంది. తన శరీరాన్ని చూసి ఇతర మహిళలు అసూయపడుతున్నారని మిలా చెబుతోంది. అయితే, ఇప్పుడు తనకు బట్టలు దొరకడం చాలా కష్టంగా మారిందని కూడా ఆమె అంగీకరించింది. ఆమె శరీరం చాలా అసాధారణంగా మారింది. సాధారణ బ్రాండ్ల దుస్తులు ఆమెకు సరిపోవు.

అందం కోసం ప్రాణాలతో పందెం..! పక్కటెముకలను తొలగించుకోబోతున్న మహిళ..
Rib Removal For Slim Waist
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2025 | 9:51 PM

Share

ప్రతి ఒక్కరూ అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఈ కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి కోరికతోనే ఒక యువతి ఎవరూ చేయని సాహాసాలు చేసింది. ఆమె నడుము సన్నగా ఉండటానికి తన పక్కటెముకలను తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాదు.. తన అందం తరగకుండా ఉండేందుకు ఇప్పటికే ఆమె చాలా సర్జరీలు చేయించుకుంది. ఇప్పటికే ఆమె రెండు బ్రెజిలియన్ బమ్ లిఫ్ట్‌లు, బట్ ఇంప్లాంట్లు, రెండు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీలు, లిప్ ఫిల్లర్లు వంటి పలుచోట్ల కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుందని తెలిసింది.

ప్రస్తుతం చేయించుకోబోయే ఈ సర్జరీ ఆమెకు ఆరవది అవుతుంది. తన శరీరాన్ని చూసి ఇతర మహిళలు అసూయపడుతున్నారని మిలా చెబుతోంది. అయితే, ఇప్పుడు తనకు బట్టలు దొరకడం చాలా కష్టంగా మారిందని కూడా ఆమె అంగీకరించింది. ఆమె శరీరం చాలా అసాధారణంగా మారింది. సాధారణ బ్రాండ్ల దుస్తులు ఆమెకు సరిపోవు.

మిలా లుక్స్ చూసి సోషల్ మీడియాలో ఆమెపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఆమె శరీరంలో చాలా ప్లాస్టిక్ ఉందని, ఒక రోజు ఆమె కరిగిపోతుందంటూ చాలా మంది కామెంట్‌ చేశారు. కానీ మిలా ఇవన్నీ పట్టించుకోదు. నేను అందంగా ఉన్నానని, ఎవరైనా నా ఫోటో తీయాలనుకుంటే, నేను ఖచ్చితంగా పోజు ఇస్తానని ఆమె చెబుతోంది. తమ బాయ్‌ఫ్రెండ్స్ తన వైపు ఆకర్షితులవుతారు కాబట్టి మహిళలు తనను ద్వేషిస్తారని మిలా నమ్ముతుంది. ఆమె ఇప్పుడు రష్యాలోని ఒక ఆసుపత్రిలో పక్కటెముకలు తొలగించే శస్త్రచికిత్సకు సిద్ధమవుతోంది. అయితే, వైద్య నిపుణులు దీనిని ప్రమాదకర దశగా భావిస్తున్నారు. అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ టిమ్ నియావిన్ ప్రకారం, ఈ ప్రక్రియ ఊపిరితిత్తులను కప్పి ఉంచే కణజాలాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో బాధితురాలు ఆస్పత్రి పాలు కావాల్సి వస్తుందని చెబుతున్నారు. కానీ, అవేవీ పట్టించుకోవటం లేదు.. చాలా మొండిగా ఉంది. ఆమె తన అందం కోసం ఈ యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..