Watch: భారీ వర్షాలు వరదలతో కొట్టుకుపోతున్న కార్లు.. షాకింగ్ వీడియోలు వైరల్.. ఎక్కడంటే..
కుండపోత వర్షం, ఆకస్మిక వరదలు రోడ్లను ముంచెత్తాయి. చెట్లు కూలిపోయాయి. ప్రధాన రవాణా మార్గాలు స్తంభించిపోయాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లు జలమయమయ్యాయి. పార్క్ చేసి ఉంచిన కార్లు పడవల్ల కొట్టుకుపోయాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికాలోని న్యూజెర్సీలో భారీ వర్షాలు కురిశాయి. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ సోమవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కుండపోత వర్షం, ఆకస్మిక వరదలు రోడ్లను ముంచెత్తాయి. చెట్లు కూలిపోయాయి. న్యూజెర్సీ టర్న్‌పైక్‌తో సహా ప్రధాన మార్గాలు స్తంభించిపోయాయి. న్యూప్రావిడెన్స్, ప్లెయిన్‌ఫీల్డ్, స్కాచ్ ప్లెయిన్స్ ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లు జలమయమయ్యాయి. పార్క్ చేసి ఉంచిన కార్లు పడవల్ల కొట్టుకుపోయాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో సంభవించిన వరదలు, కార్లు కొట్టుకుపోతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
