AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: అలస్కాలో భారీ భూకంపం… తీవ్రత 7.3గా నమోదు… సునామీ హెచ్చరికలు జారీ

అలస్కాలో భారీ భూకంపం సంబవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో అలస్కాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ శక్తివంతమైన భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ళు) లోతులో సంభవించింది. అలాస్కా ద్వీపకల్పం మధ్యలో ఉన్న పోపోఫ్ ద్వీపంలోని సాండ్ పాయింట్ సమీపంలోభూకంపం...

Earthquake: అలస్కాలో భారీ భూకంపం... తీవ్రత 7.3గా నమోదు... సునామీ హెచ్చరికలు జారీ
Alaska Earthquake
K Sammaiah
|

Updated on: Jul 17, 2025 | 6:38 AM

Share

అలస్కాలో భారీ భూకంపం సంబవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో అలస్కాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ శక్తివంతమైన భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ళు) లోతులో సంభవించింది. అలాస్కా ద్వీపకల్పం మధ్యలో ఉన్న పోపోఫ్ ద్వీపంలోని సాండ్ పాయింట్ సమీపంలోభూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. “తీవ్రమైన నష్టాన్ని” కలిగించే సామర్థ్యం ఉన్న భూకంపం అని మిచిగాన్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం పరిశోధకలు పేర్కొన్నారు.

భూకంపం తర్వాత, యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ అలాస్కా తీరప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని మరియు భద్రతా సూచనలను పాటించాలని అధికారులు కోరారు. సాండ్ పాయింట్‌కు దక్షిణంగా భూకంపం “పసిఫిక్ మరియు ఉత్తర అమెరికా ప్లేట్‌ల మధ్య సబ్‌డక్షన్ జోన్ ఇంటర్‌ఫేస్‌పై లేదా సమీపంలో థ్రస్ట్ ఫాల్టింగ్ ఫలితంగా” సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.

అయితే, ఒక గంట తర్వాత, తక్షణ ముప్పు తగ్గడంతో హెచ్చరికను సలహాగా తగ్గించారు. బలమైన అలలు, ఆకస్మాత్తుగా వరదలు సమీపంలో ఉన్నవారికి ప్రమాదాన్ని కలిగిస్తాయని అధికారులు హెచ్చరించారు.

యుఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం విస్తృత తీరప్రాంతాన్ని కవర్ చేస్తూ హెచ్చరికను జారీ చేసింది. హోమర్‌కు నైరుతి దిశలో దాదాపు 40 మైళ్ల దూరంలో ప్రారంభమై దాదాపు 700 మైళ్ల విస్తీర్ణంలో ఉన్న యునిమాక్ పాస్ వరకు విస్తరించి ఉంది. వీటిలో సుమారు 5,200 జనాభా కలిగిన కీలక ప్రాంతీయ కేంద్రమైన కోడియాక్ కూడా ఉంది.

ప్రభావితమవుతుందని భావిస్తున్న మొదటి ప్రదేశాలలో ఒకటి అలూటియన్ గొలుసులోని పోపోఫ్ ద్వీపంలో ఉన్న మారుమూల గ్రామం సాండ్ పాయింట్. ఇక్కడ దాదాపు 580 మంది జనాభా ఉన్నారు. అప్రమత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలను సరుక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 4,100 మంది జనాభా నివసించే మత్స్యకార పట్టణం ఉనలస్కాలో, స్థానిక అధికారులు నివాసితులను సముద్ర మట్టానికి కనీసం 50 అడుగుల ఎత్తులోకి వెళ్లాలని కోరారు. ఇంతలో, అలాస్కా ద్వీపకల్పంలోని దక్షిణ తీరంలో దాదాపు 870 మంది జనాభా కలిగిన కింగ్ కోవ్‌లో, తీరప్రాంతానికి సమీపంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.

అలాస్కా యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత భూకంప క్రియాశీల రాష్ట్రం. ప్రపంచంలోని భూకంపాలలో దాదాపు 11% మరియు USలో 17.5% భూకంపాలు ఇక్కడే సంభవిస్తున్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి దాని స్థానం కారణంగా అత్యధికంగా భూకంపాలు సంభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకు ఉత్తర అమెరికాలో అతిపెద్ద భూకంపం అలస్కాలోనే సంభవించింది. 1964లో సంభవించిన గ్రేట్ అలాస్కా భూకంపం 9.2 తీవ్రతగా నమోదైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద భూకంపంగా రికార్డులకెక్కింది.