AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నో ఆవిష్కరణలు చేసినా మానవాళి మేలు కోసం పేటెంట్ రైట్స్ తీసుకోని శాస్త్రవేత్త బెంజమిన్ గురించి మీకు తెలుసా..

తాను మనిషి కోసం ఏదైనా చేయాలి.. సరికొత్త ఆవిష్కరణలు చేయాలని ఆలోచించి వర్షంలో గాలిపటాలు ఎగురవేసాడు. అతనే ప్రముఖ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇతని ఫోటో 100 డాలర్ల నోటుపై ముద్రించి ఉంటుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలో కాన్సెప్ట్ ఒకరి నుంచి సాయం అందుకుంటే మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పమని కోరడం.. ఈ పనిని అప్పట్లోనే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆచరించి చూపించాడు కూడా.. గొప్ప శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ వర్ధంతి నేడు. ఆయనను సాధించిన ఆవిష్కరణలు గురించి తెలుసుకుందాం.. 

ఎన్నో ఆవిష్కరణలు చేసినా మానవాళి మేలు కోసం పేటెంట్ రైట్స్ తీసుకోని శాస్త్రవేత్త బెంజమిన్ గురించి మీకు తెలుసా..
Benjamin Franklin
Surya Kala
|

Updated on: Apr 17, 2024 | 5:40 PM

Share

పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక రోజు ఒక వ్యక్తి భారీ వర్షంలో గాలిపటం ఎగురవేస్తున్నాడు. అయితే ఆ  గాలిపటం ఎగరవేసే దారం చివరన ఇనుప తాళం కట్టి ఉంది. వర్షంలో ఒక్కసారిగా ఒక మెరుపు వచ్చింది.. అప్పుడు తాళం చెవి నుంచి స్పార్క్స్ రావడం ప్రారంభమైంది. గాలిపటం ఎగురవేస్తున్న వ్యక్తి  ఆ పిడుగు తన ప్రాణాలను తీయగలదని ఆలోచిస్తున్నాడు. అయితే తాను మనిషి కోసం ఏదైనా చేయాలి.. సరికొత్త ఆవిష్కరణలు చేయాలని ఆలోచించి వర్షంలో గాలిపటాలు ఎగురవేసాడు. అతనే ప్రముఖ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇతని ఫోటో 100 డాలర్ల నోటుపై ముద్రించి ఉంటుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలో కాన్సెప్ట్ ఒకరి నుంచి సాయం అందుకుంటే మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పమని కోరడం.. ఈ పనిని అప్పట్లోనే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆచరించి చూపించాడు కూడా.. గొప్ప శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ వర్ధంతి నేడు. ఆయనను సాధించిన ఆవిష్కరణలు గురించి తెలుసుకుందాం..

జనవరి 17, 1706న అమెరికాలో జన్మించిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేక ఆవిష్కరణలు చేశారు. అయితే  మానవాళి శ్రేయస్సు కోసం తాను కనిపెట్టిన వేటికీ పేటెంట్ హక్కులను తీసుకోలేదు. వర్షంలో గాలిపటాలు ఎగరవేసి ఈ ప్రయోగం ద్వారా ఈ రోజు మనకు తెలిసిన విద్యుత్ ప్రవాహాల గురించి, దానిని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు సమాచారాన్ని అందించాడు. ఫ్రాంక్లిన్ ఎత్తైన భవనాలను పిడుగుపాటు నుంచి రక్షించడానికి మెరుపు కడ్డీని (మెరుపు వాహకం) కనుగొన్నాడు.

స్టవ్, బైఫోకల్ గ్లాసెస్ తయారీ

1720 సంవత్సరంలో జర్మన్ రూపొందించిన ఐదు-ప్లేట్ స్టవ్‌లు ఆహారాన్ని వండడానికి ఉపయోగించబడ్డాయి. అయితే అవి సైజ్ లో చాలా పెద్దవి. బెంజమిన్ దానిని సవరించాడు. ఫ్రాంక్లిన్ స్టవ్ లేదా ఇనుప కొలిమి వంటి పొయ్యిని సృష్టించాడు. దీంతో మహిళలకు వంట చేయడం సులభతరం అయింది. తర్వాత కాలక్రమంలో స్టవ్ రూపకల్పనలో అనేక మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి.  అంతేకాదు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇచ్చిన శీతలీకరణ సూత్రంపై రిఫ్రిజిరేటర్, AC లను తయారు చేశారు.  బైఫోకల్ గ్లాసెస్ తయారీలో కూడా ఫ్రాంక్లిన్ సహకారం ఉంది. ఇలా ఎన్ని వస్తువుల తయారీకి సరికొత్త ఆవిష్కరణలు చేసినా వాటికి ఫ్రాంక్లిన్ పేటెంట్ హక్కులను పొందలేదు. తద్వారా ప్రజలు వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

10 ఏళ్ల వయస్సులో పాఠశాలను విడిచిపెట్టిన ఫ్రాంక్లిన్

బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1706 ADలో అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలో జన్మించారు.  అతని తండ్రి కొవ్వొత్తులను తయారు చేసేవాడు. 17 మంది పిల్లలలో 15వవాడు ఫ్రాంక్లిన్. దీంతో 10 ఏళ్ల  వయస్సులో చదువు మానేసి.. తన అన్నయ్యతో కలిసి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేయడం ప్రారంభించాడు. ప్రింటింగ్ ప్రెస్ లోని పుస్తకాలను చదువుతూ విజ్ఞానాన్ని పెంచుకున్నడు.. విద్యను అభ్యసించాడు.

అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తుల్లో ఒకరు ఫ్రాంక్లిన్

అమెరికాలో ఫ్రాంక్లిన్ గొప్ప సంగీతకారుడిగా, ప్రసిద్ధ చెస్ ఆటగాడిగా కూడా ప్రసిద్ధి చెందారు. అతను అమెరికన్ చెస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చబడ్డారు. అమెరికా స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ఫ్రాంక్లిన్ పాల్గొన్నారు. అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తులలో జార్జ్ వాషింగ్టన్ తర్వాత ఫ్రాంక్లిన్ రెండవ స్థానంలో ఉన్నారు. జనాభా అధ్యయనంపై కూడా ఆయన చాలా కృషి చేశారు. ఫ్రాంక్లిన్ 1790 ఏప్రిల్ 17న ఫిలడెల్ఫియాలో మరణించారు.

సహాయ గొలుసును ప్రారంభించిన ఫ్రాంక్లిన్

ఫ్రాంక్లిన్ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసే సమయంలో ఒకసారి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అప్పుడు  ఒకరి నుండి 20 డాలర్లు అప్పుగా తీసుకున్నాడు. ఆ వ్యక్తి చాలా ధనవంతుడు. తిరిగి తాను తీసుకున్న 20 (బంగారు నాణేలు) డాలర్లను తిరిగి చెల్లించడానికి ఆ ధనవంతుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతను తాను ఫ్రాంక్లిన్ గుర్తించలేదని చెప్పాడు. అప్పుడు తన గురించి తాను తీసుకున్న అప్పు గురించి అనేక విధాలుగా ఆ ధనవంతుడికి గుర్తు చేశాడు. చివరకు ఫ్రాంక్లిన్ ని గుర్తించి తాను ఇచ్చిన డబ్బులను తిరిగి తీసుకోవడానికి నిరాకరించాడు. డబ్బును ఫ్రాంక్లిన్ దగ్గరే ఉంచుకోమని.. ఎప్పుడైనా ఎవరైనా సహాయం అడిగితే చేయమని ఫ్రాంక్లిన్‌కు చెప్పాడు. ఆ ధనవంతుడు చెప్పిన విషయానికి ముగ్ధుడైన ఫ్రాంక్లిన్ తిరిగి వచ్చేశాడు. తర్వాత ఒక పేద యువకుడికి ఆ 20 బంగారు నాణేలను ఇచ్చాడు. అప్పుడు తనకు ఆ ధనవంతుడు చెప్పిన మాటనే ఆ యువకుడికి చెప్పాడు. ఈ విధంగా అమెరికాలో ఒక గొలుసు సహాయానికి శ్రీకారం చుట్టారు ఫ్రాంక్లిన్.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..