Lord Rama Bank: రాముడి ప్రత్యేక బ్యాంకు, సీతారాం అని 5 లక్షల సార్లు రాస్తేనే ఖాతా తెరుచుకుంటుంది

శ్రీ రామ నవమి సందర్భంగా అయోధ్యలో బాల రామయ్యకు సూర్య కిరణాలు తిలక ధారణ చేశాయి. అయితే రామ జన్మ భూమిలో ఒక ప్రత్యేకమైన బ్యాంకు కూడా ఉందని మీకు తెలుసా. ఈ బ్యాంకు పేరు ఇంటర్నేషనల్ సీతారామ్ బ్యాంక్. రాముడి నగరంలోని ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే సీతారాం అని 5 లక్షల సార్లు రాయాలి. ఈ బ్యాంకు 1970 సంవత్సరంలో స్థాపించబడింది.ఈ బ్యాంకులో 35,000 మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ బ్యాంకు ఖాతాదారులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. భారతదేశంతో పాటు, ఈ బ్యాంకుకు అమెరికా, బ్రిటన్, కెనడా, నేపాల్, ఫిజీ, యుఎఇ వంటి దేశాలకు చెందిన వ్యక్తులు కూడా ఖాతాదారులుగా ఉన్నారు.

Lord Rama Bank: రాముడి ప్రత్యేక బ్యాంకు, సీతారాం అని 5 లక్షల సార్లు రాస్తేనే ఖాతా తెరుచుకుంటుంది
International Shree Sitaram Bank
Follow us
Surya Kala

|

Updated on: Apr 17, 2024 | 3:39 PM

దేశవ్యాప్తంగా శ్రీ రామ నవమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ రామ నవమి సందర్భంగా అయోధ్య పూర్తిగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. నిజానికి అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బలరామయ్య ప్రతిష్టాపన తర్వాత ఇదే మొదటి శ్రీ రామ నవమి. ఈ ప్రత్యేక సందర్భంలో అయోధ్యలో సూర్య కిరణాలు బాల రామయ్యకు తిలక ధారణ చేశాయి. అయితే రామ జన్మ భూమిలో ఒక ప్రత్యేకమైన బ్యాంకు కూడా ఉందని మీకు తెలుసా. ఈ బ్యాంకు పేరు ఇంటర్నేషనల్ సీతారామ్ బ్యాంక్. ఈ బ్యాంకు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

రాముడి నగరంలోని ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే సీతారాం అని 5 లక్షల సార్లు రాయాలి. ఈ బ్యాంకు 1970 సంవత్సరంలో స్థాపించబడింది. ఇక్కడ భక్తులు రాముడి పేరుతో రుణం పొందుతారు. ఈ బ్యాంకులో 35,000 మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ బ్యాంకు ఖాతాదారులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. భారతదేశంతో పాటు, ఈ బ్యాంకుకు అమెరికా, బ్రిటన్, కెనడా, నేపాల్, ఫిజీ, యుఎఇ వంటి దేశాలకు చెందిన వ్యక్తులు కూడా ఖాతాదారులుగా ఉన్నారు.

20,000 కోట్ల సీతారాం బుక్‌లెట్లు

రామ జన్మ భూమిలో నిర్మించిన ఈ బ్యాంకు భక్తుల నుంచి స్వీకరించిన 20,0000 కోట్ల సీతారాముల బుక్‌లెట్లను కలిగి ఉంది. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్టించిన ప్రయోజనం కూడా ఈ బ్యాంకుకే దక్కింది. ప్రాణ ప్రతిష్ట తర్వాత ఈ బ్యాంకుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఈ బ్యాంక్ ప్రతి ఖాతాను ట్రాక్ చేస్తుంది. బ్యాంక్ తన ఖాతాదారులందరికీ ఉచిత బుక్‌లెట్, రెడ్ పెన్ను బహుమతిగా ఇస్తుంది. ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే బుక్‌లెట్‌పై సీతారాం అని 5 లక్షల సార్లు రాయాలి. అప్పుడే మీ ఖాతా తెరిచి పాస్‌బుక్ జారీ చేస్తారు. ఈ బ్యాంక్ దేశంలో,  ప్రపంచవ్యాప్తంగా మొత్తం 136 శాఖలను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

రుణం ఎలా పొందాలి

ఉదాహరణకు ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే ‘సీతారాం’ అని 5 లక్షల సార్లు రాయాలి. అదేవిధంగా ఈ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఈ రుణాన్ని బ్యాంకు మూడు వేర్వేరు రూపాల్లో అందజేస్తుంది. మొదట కర్మ కాలపరిమితిని చెప్పాలి. అదే సమయంలో రుణాన్ని తిరిగి చెల్లించడానికి నిర్ణీత సమయం ఇవ్వబడుతుంది. రామ్ అనే ఈ బ్యాంక్ పూర్తిగా భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థను అనుసరిస్తుంది. ఈ బ్యాంకు నుండి దేవుని పేరు మీద రుణం మూడు విధాలుగా లభిస్తుంది. మొదటిది రామ నామాన్ని జపించడం, రెండవది రామ నామాన్ని పఠించడం, మూడవది రామ నామాన్ని రాయడం. ఈ బ్యాంక్ లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి 8 నెలల 10 రోజుల గడువు ఇస్తారు. అప్పుడు 1.25 లక్షల సార్లు రాముడి పేరు రాయాల్సి ఉంది.

లావాదేవీలుగా డబ్బు కాదు.. మతం, శాంతి, విశ్వాసాలు మాత్రమే

ఈ బ్యాంక్ లో రుణం డబ్బుగా ఇవ్వరు. రాముడి పేరుతో ఇవ్వబడుతుంది. ఋణం తీసుకున్నవారు నిర్ణీత గడువులోగా ఇక్కడ వ్రాసి సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన, అద్భుతమైన రామ నామ బ్యాంకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఋణం తీసుకునేందుకు సప్త సముద్రాలను దాటి మరీ భక్తులు అయోధ్య నగరానికి  వస్తుంటారు. ఈ బ్యాంకులో ప్రధాన లావాదేవీలు డబ్బు కాదు, మతం, అంతర్గత శాంతి, విశ్వాసం. ఈ బ్యాంకులో ఖాతా తెరిచిన ఏ భక్తుడైనా ఈ మూడు విషయాలతో లావాదేవీలు జరిపి అపారమైన శాంతిని పొందుతాడు. ఈ బ్యాంకు ఖాతాదారులు 1 కోటి కంటే ఎక్కువ బుక్‌లెట్లను బ్యాంకుకు వ్రాసారు. అలా 25 లక్షలకు పైగా సీతారాముల నామాన్ని రాసిన భక్తులు కొందరున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే