Sri Ramanavami: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు.. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ రాములోరి కళ్యాణం..
శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి పూజ, వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీ సీతాదేవికి మాంగల్య ధారణ, తలంబ్రాలు, మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానానికి అనుబంధ అలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుండి శ్రీ సీతారామస్వామికి శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. పూజలనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి పూజ, వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీ సీతాదేవికి మాంగల్య ధారణ, తలంబ్రాలు, మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం అధికారులు, సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించారు. అనంతరం దేవస్థానం భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..