Jupiter Transit: ఈ రోజు నక్షత్రాన్ని మార్చుకున్న బృహస్పతి.. ఈ నాలుగు రాశులకు ఆర్ధికంగా శుభప్రదం..

శ్రీ రామ నవమిని పండగను ఈ రోజు (ఏప్రిల్ 17వ తేదీన ) దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు మరో విశిష్టత కూడా ఉందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు దేవతల గురువు బృహస్పతి   భరణి నక్షత్రం నుంచి కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించించాడు. బృహస్పతి సంచారంతో కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారమే అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.. 

Jupiter Transit: ఈ రోజు నక్షత్రాన్ని మార్చుకున్న బృహస్పతి.. ఈ నాలుగు రాశులకు ఆర్ధికంగా శుభప్రదం..
Jupiter Transit On Sri Rama Navami
Follow us
Surya Kala

|

Updated on: Apr 17, 2024 | 4:32 PM

హిందూమతంలో విశిష్టమైన పండగలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి చైత్రమాసం శుద్ధ నవమి రోజున జరుపుకునే శ్రీ రామ నవమి. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు జన్మించిన శ్రీ రామ నవమిని పండగను ఈ రోజు (ఏప్రిల్ 17వ తేదీన ) దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు మరో విశిష్టత కూడా ఉందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు దేవతల గురువు బృహస్పతి   భరణి నక్షత్రం నుంచి కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించించాడు. బృహస్పతి సంచారంతో కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారమే అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశికి చెందిన వారికి బృహస్పతి నక్షత్రంలో మార్పు వలన ఆర్ధికంగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తారు. నాలుగు విధాలుగా డబ్బులు సంపాదిస్తారు. చేపట్టిన ప్రతి పని పూర్తి చేసుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు.

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఆర్ధికంగా లాభాలను తెస్తుందట. వ్యవసాయం, వృత్తి, వ్యాపార రంగంలో ఉన్నవారు లాభాలను ఆర్జిస్తారు. అదృష్టం కలిసి వచ్చి డబ్బులను సంపాదిస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులు గుడ్ న్యూస్ వింటారు.

ఇవి కూడా చదవండి

తులా రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా అన్నింటా శుభప్రదంగా ఉంటుంది. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. సంపాదన పెరిగి కొత్త ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు వెళ్తారు. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం లభించే అవకాశం ఉంది. కొత్తగా భూములు కొనుగోలు చేయాలనీ చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఈ రోజు నుంచి బాగుంటుంది. ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో లాభాలను పొందుతారు. పిల్లల వలన శుభవార్త వింటారు.. ధన లాభం కలిగి సంతోషంగా ఉంటారు. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు