Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Favorite Zodiacs: శనీశ్వరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. ఎల్లప్పుడూ అనుగ్రహం వీరి సొంతం.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎవరి జన్మ కుండలిలో శని దుర్భరమైన ఇంట్లో కూర్చొని ఉంటే  వారి కష్టాలు, సమస్యలకు పరిమితి ఉండదు. అదే సమయంలో జన్మ కుండలిలో శనీశ్వరుడు శుభ స్థానంలోకి ఉంటే అటువంటి వ్యక్తి హోదా, సంపద, సంపద, గౌరవం పెరుగుతాయి. అయితే జన్మ కుండలిలో సంబంధం లేకుండా శనీశ్వరుడు ఎల్లప్పుడూ కొన్ని రాశుల పట్ల దయతో ఉంటాడు. ఈ రాశులకు చెందిన వ్యక్తులకు ఏ విధంగానూ హాని చేయడని జ్యోతిష్కులు చెబుతారు.

Shani Favorite Zodiacs: శనీశ్వరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. ఎల్లప్పుడూ అనుగ్రహం వీరి సొంతం.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
Shani Favorite Zodiac Signs
Follow us
Surya Kala

|

Updated on: Apr 17, 2024 | 7:22 PM

జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు ప్రత్యేక స్థానం ఉంది. నవ గ్రహాలకు అధిపతి ప్రత్యేక్ష దైవం సూర్యుడికి తనయుడు శనీశ్వరుడు న్యాయ దేవత. కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే దైవంగా పరిగణిస్తారు. శనీశ్వరుడు వ్యక్తి కర్మలను బట్టి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడు. అయితే శనీశ్వరుడి పేరు చెప్పగానే అందరూ భయపడతారు. ఆయన ద్రుష్టి తమ మీద పడకూడదు అని కోరుకుంటారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎవరి జన్మ కుండలిలో శని దుర్భరమైన ఇంట్లో కూర్చొని ఉంటే  వారి కష్టాలు, సమస్యలకు పరిమితి ఉండదు. అదే సమయంలో జన్మ కుండలిలో శనీశ్వరుడు శుభ స్థానంలోకి ఉంటే అటువంటి వ్యక్తి హోదా, సంపద, సంపద, గౌరవం పెరుగుతాయి. అయితే జన్మ కుండలిలో సంబంధం లేకుండా శనీశ్వరుడు ఎల్లప్పుడూ కొన్ని రాశుల పట్ల దయతో ఉంటాడు. ఈ రాశులకు చెందిన వ్యక్తులకు ఏ విధంగానూ హాని చేయడని జ్యోతిష్కులు చెబుతారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మకర రాశి: శనీశ్వరుడికి ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడే. వేద గ్రంధాల ప్రకారం శనీశ్వరుడు సంచార సమయంలో కొన్ని రాశులకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కొన్ని రాశులకు శని ప్రభావం ముగుస్తుంది. అయితే మకరరాశిలో శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ఉన్నప్పటికీ.. ఈ సమయంలో కర్మ ప్రదాత వీరికి ప్రత్యేక ఇబ్బందిని కలిగించడు. మకర రాశి వారు శనీశ్వరుడిని పూజిస్తే త్వరగా అనుగ్రహహిస్తాడు. దీంతో వీరు శనిదోషం నుంచి త్వరగా విముక్తి పొందుతారు.

కుంభ రాశి: ఈ కుంభ రాశి శనీశ్వరుడికి రెండవ ఇష్టమైన రాశి. ఈ రాశికి కూడా అధిపతి శనీశ్వరుడే. కుంభ రాశికి చెందిన వ్యక్తులపై శనీశ్వరుడి దృష్టి చల్లగా ఉంటుంది. దీంతో ఈ రాశి వ్యక్తుల జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు అనేది ఉండదు.

ఇవి కూడా చదవండి

తులా రాశి: ఈ తులారాశిని శనీశ్వరుడి లగ్నంగా పరిగణిస్తారు. శనీశ్వరుడు ఎల్లప్పుడూ శుభ స్థానంలో ఉంటాడు. తులారాశి వారి కుండలిలో శనీశ్వరుడు శుభ గ్రహంతో కలిసి ఉంటే.. ఈ కలయిక చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువ కాలం శనీశ్వరుడి వలన బాధపడాల్సిన అవసరం ఉండదు.

ధనుస్సు రాశి: ఈ రాశికి అధిపతి బృహస్పతి. శనీశ్వరుడికి బృహస్పతికి మధ్య మంచి స్నేహం ఉంది.  అందుకే శనీశ్వరుడు ధనుస్సు రాశి వారి పట్ల ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. వీరి జాతకంలోనైనా శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ఉంటే  ఏలిన నాటి శని ఉన్నా.. ఏడున్నర వారాలు సంచరించినా శనీశ్వరుడు దయతోనే ఉంటాడట. సూర్య పుత్రుడు శని ధనుస్సు రాశి వారికి ఆనందం, శ్రేయస్సు,  సంపదను ఇస్తాడు.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారిపై కూడా శనీశ్వరుడి విశేష ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడు వృషభ రాశి వారిని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఈ రాశి వారికి డబ్బుకు లోటు ఉండదు. వీరి జీవితాలు ఆనందంతో నిండి ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు