Horoscope Today: ఆ రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 18, 2024): మేష రాశి వారికి ఈ రోజు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (ఏప్రిల్ 18, 2024): మేష రాశి వారికి ఈ రోజు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలలో మీ మాట చెల్లుబాటవుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరగడానికి అవకాశముంది. రాదనుకున్న డబ్బు చిన్న ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఖర్చుల్ని తగ్గించుకో వడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్ని కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మీద కాస్తంత ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఉద్యోగులు మరింత ఉద్యోగంలోకి మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలకు వెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశముంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితంలో ఆదరణలు, అభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రయాణాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విహార యాత్రకు వెళ్లే అవకాశముంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు తిరుగుండదు. పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్త వుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూ లంగా ఉంటాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చాలావరకు చక్కబడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన పనులు చేపట్టడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరగడానికి అవకాశ ముంది. వ్యాపారాలలో ఆర్థికంగా ముందడుగు వేస్తారు. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సకా లంలో పూర్తవు తాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక విషయాల్లో రోజంతా బాగానే ఉంటుంది కానీ, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో అను కూలతలు పెరుగుతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులతో మీ సలహాలు, సూచనలు బాగా నచ్చు తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి కానీ, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. చేప ట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన ఆల యాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు చాలావరకు నిలకడగా ముందుకు సాగుతాయి. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలకు ఆశిం చిన గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలతో పాటు రాబడి కూడా పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో భారం పెరిగినా, తగిన ప్రతిఫలం ఉంటుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. మీ దగ్గర నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను మోయాల్సి వస్తుంది. అనేక మార్గాల్లో ధన లాభం పొందుతారు. ముఖ్యమైన పనులు, వ్యవహా రాలు చురుకుగా పూర్తవుతాయి. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి. వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి.