మానవాతీత శక్తుల కోసం పుట్టిన పసికందుకు సూర్య రశ్మి డైట్.. చిన్నారి మృతి.. తండ్రికి జైలు శిక్ష

రష్యాకి చెందిన మాగ్జిమ్ లూటీ , ఒక్సానా మిరోనోవా దంపతులకు అందమైన మగబిడ్డ జన్మించాడు. పసికందును సూర్యకిరణాలు తాకేలా చేస్తే మానవాతీత శక్తి వస్తుందని భావించి.. కనీసం తల్లి పాలు కూడా తాగనివ్వకుండా ఆ చిన్నారి బాలుడు చనిపోవడానికి తండ్రి కారణమయ్యాడు. అప్పుడే పుట్టిన చిన్నారికి పాలు కూడా లేకపోవడం.. చలిలో ఆరుబయట ఉండడంతో.. పౌష్టికాహార లోపం, న్యుమోనియాతో బారిన పడ్డాడు. దీంతో ఆ చిన్నారి బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

మానవాతీత శక్తుల కోసం పుట్టిన పసికందుకు సూర్య రశ్మి డైట్.. చిన్నారి మృతి.. తండ్రికి జైలు శిక్ష
Russian Influencer
Follow us
Surya Kala

|

Updated on: Apr 17, 2024 | 6:50 PM

పిల్లలను ప్రతి తల్లిదండ్రులు అపురూపంగా పెంచుకుంటారు. తమ శక్తికి మించి మరీ కోరిన కోర్కెలు తీరుస్తారు. ఇక అప్పుడే పుట్టిన శిశివుని ఎత్తుకోవడం తల్లి దండ్రులకు ఓ అపురూప జ్ఞాపకం.. అయితే ఓ తండ్రి మాత్రం అప్పుడే పుట్టిన పిల్లాడికి యముడిగా మారాడు. మానవాతీత శక్తులు వస్తాయని చెప్పి చేసిన పనితో పుట్టిన గంటల్లోనే నూరేళ్లు నిండిపోయాయి ఆ పసికందుకు. ఈ దారుణ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రష్యాలోని సోచికి చెందిన మాగ్జిమ్ లూటీ , ఒక్సానా మిరోనోవా దంపతులకు అందమైన మగబిడ్డ జన్మించాడు. పసికందును సూర్యకిరణాలు తాకేలా చేస్తే మానవాతీత శక్తి వస్తుందని భావించి.. కనీసం తల్లి పాలు కూడా తాగనివ్వకుండా ఆ చిన్నారి బాలుడు చనిపోవడానికి తండ్రి కారణమయ్యాడు. అప్పుడే పుట్టిన చిన్నారికి పాలు కూడా లేకపోవడం.. చలిలో ఆరుబయట ఉండడంతో.. పౌష్టికాహార లోపం, న్యుమోనియాతో బారిన పడ్డాడు. దీంతో ఆ చిన్నారి బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో చిన్నరి తల్లి తన భర్తపై కేసు పెట్టింది. విచారణ చేపట్టిన కోర్టు ఆ కసాయి తండ్రికి కోర్టు శిక్ష విధించింది.  ఉద్దేశ్యపూర్వకంగా తీవ్రమైన శారీరక హాని కలిగించి మరణానికి కారణం అయినందుకు కోర్టు చిన్నారి తండ్రికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ విషయంపై చిన్నారి తల్లి ఒక్సానా మిరోనోవా మాట్లాడుతూ తనను ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లమని  ఎన్నిసార్లు కోరినా తన భర్త లూటీ అంగీకరించలేదని..  అందుకే ఇంట్లోనే బిడ్డ పుట్టిందని చెప్పింది. అంతేకాదు మానవాతీత శక్తులు వస్తాయని అప్పుడే పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వకుండా ఎండలో పడుకోబెట్టాడని పేర్కొంది. అయితే తన భర్తకు కనిపించకుండా శిశువుకు పాలివ్వడానికి ప్రయత్నించినట్లు.. అయితే తన భర్తకు భయపడి పాలు ఇవ్వలేక పోయాయని చెప్పింది. చిన్నారి మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే సాధారణంగా చలికాలంలో తెల్లవారుజామున లేలేత సూర్యులకిరణాలు పడడం శిశువు ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే రోజంతా ఎండలో బిడ్డను ఉంచి చంపడం.. మూఢనమ్మకం అని అనాల్సిందే..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..