బస్ కండక్టర్ రూ.5 చిల్లర ఇవ్వలేదు.. పరిష్కారం ఏదైనా ఉందా అంటూ ఓ ప్రయాణీకుడు ఆవేదన
కొంతమంది బస్సు కండక్టర్లు తమకు వీలైనంత వరకూ ప్రయాణీకులకు చిల్లర తిరిగి ఇచ్చేస్తారు. అంటే బస్ టికెట్ ధర 19 రూ. ఉన్నట్లయితే, .. ప్రయాణీకుడికి ఒక్క 1 రూపాయి చిల్లర డబ్బును కూడా తిరిగి ఇచ్చేస్తాడు. అయితే కొన్ని సార్లు ఎంత మందికి చిల్లర ఇవ్వాలి.. అందరూ నోట్లు ఇస్తున్నారు అంటూ కొంతమంది కండక్టర్లు చిల్లర ప్రయాణికులకు తిరిగి ఇవ్వరు. ఇప్పుడు ఇలాంటి ఘటన ఒకటి బెంగుళూరులోని బీఎంటీసీ బస్సులో చోటు చేసుకుంది. తనకు రూ. 5 ల చిల్లరను కండక్టర్ ఇవ్వలేదని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
బస్సు కండక్టర్లు చిల్లర గురించి రకరకాల జోక్స్ తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు బస్సు కండక్టర్లు, ప్రయాణికుల మధ్య చిల్లర డబ్బుల విషయంలో తరచూ గొడవలు జరుగుతుంటాయి. అయితే బస్సులో ప్రయాణించే ప్రయాణీకులు తమకు టికెట్ కు సరిపడా చిల్లర ఇచ్చి సహకరించమని కోరుతూ ఉంటారు. ఈ విషయం బస్సులోపల గోడలపై కూడా రాసి ఉంటాయి. అయితే కొంతమంది బస్సు కండక్టర్లు తమకు వీలైనంత వరకూ ప్రయాణీకులకు చిల్లర తిరిగి ఇచ్చేస్తారు. అంటే బస్ టికెట్ ధర 19 రూ. ఉన్నట్లయితే, .. ప్రయాణీకుడికి ఒక్క 1 రూపాయి చిల్లర డబ్బును కూడా తిరిగి ఇచ్చేస్తాడు. అయితే కొన్ని సార్లు ఎంత మందికి చిల్లర ఇవ్వాలి.. అందరూ నోట్లు ఇస్తున్నారు అంటూ కొంతమంది కండక్టర్లు చిల్లర ప్రయాణికులకు తిరిగి ఇవ్వరు. ఇప్పుడు ఇలాంటి ఘటన ఒకటి బెంగుళూరులోని బీఎంటీసీ బస్సులో చోటు చేసుకుంది. తనకు రూ. 5 ల చిల్లరను కండక్టర్ ఇవ్వలేదని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఈ పోస్ట్‌ని నితిన్ కృష్ణ (N_4_NITHIN) తన X ఖాతాలో షేర్ చేశాడు. కండక్టర్ దగ్గర 1 రూపాయి చిల్లర కూడా లేదు.. దీంతో నేను నా 5 రూపాయల డబ్బు పోగొట్టుకున్నాను.. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా?” అనే క్యాప్షన్ తో నితిన్ BMTC అధికారిక X ఖాతాకి ట్యాగ్ చేశాడు.
వైరల్ పోస్ట్‌ను ఇక్కడ చూడండి:
I lost my 5 rs as this conductor didnt had even 1 rupee change (?) to return. Is there any solution to this? @BMTC_BENGALURU pic.twitter.com/2KFCCN5EOW
— Nithin Krishna (@N_4_NITHIN) April 14, 2024
నితిన్ రాగిగుడ్డ దేవాలయం నుంచి హెచ్‌ఎస్‌ఆర్ డిపోకు బిఎమ్‌టిసి బస్సులో బయలుదేరాడు. టికెట్ ధర రూ.15 కావడంతో నితిన్ రూ.20 నోటును కండక్టర్ కు ఇచ్చాడు. అయితే కండక్టర్ 5 రూపాయల చిల్లర డబ్బులు నితిన్ కు తిరిగి ఇవ్వలేదు. దీంతో కండక్టర్ చిల్లర డబ్బులు తిరిగి ఇవ్వలేదని సోషల్ మీడియాలో ఆ టికెట్ ను షేర్ చేస్తూ నితిన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏప్రిల్ 14న షేర్ చేసిన ఈ పోస్ట్‌కి 72 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే యూపీఐ ద్వారా టిక్కెట్ ధర చెల్లించాలని నెటిజన్లు సూచించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..