AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు! వారికి ఆకస్మిక ధనలాభం

సహజ వక్ర గ్రహమైన రాహువు, ప్రస్తుతం వక్రించి ఉన్న బుధుడు మీన రాశిలో కలవడం వల్ల, కొందరి జీవితాల్లో చిత్ర విచిత్ర యోగాలు ఏర్పడబోతున్నాయి. ఊహించని మార్పులు చోటు చేసు కుంటాయి. హఠాత్తుగా పదోన్నతులు లభించడం, ఆకస్మిక ధన లాభం, అనుకోకుండా జీవితంలో మార్పులు, కుదరదనుకున్న పెళ్లి సంబంధాలు కుదరడం వంటివి జరుగుతాయి.

Zodiac Signs: మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు! వారికి ఆకస్మిక ధనలాభం
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 16, 2024 | 6:58 PM

Share

సహజ వక్ర గ్రహమైన రాహువు, ప్రస్తుతం వక్రించి ఉన్న బుధుడు మీన రాశిలో కలవడం వల్ల, కొందరి జీవితాల్లో చిత్ర విచిత్ర యోగాలు ఏర్పడబోతున్నాయి. ఊహించని మార్పులు చోటు చేసు కుంటాయి. హఠాత్తుగా పదోన్నతులు లభించడం, ఆకస్మిక ధన లాభం, అనుకోకుండా జీవితంలో మార్పులు, కుదరదనుకున్న పెళ్లి సంబంధాలు కుదరడం వంటివి జరుగుతాయి. ఆశించనివి, ఊహించనివి ఎక్కువగా జరిగే అవకాశముంటుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారు తప్పకుండా ఈ ఆకస్మిక సానుకూల మార్పులు అనుభవించడం జరుగుతుంది. బుధ గ్రహ వక్ర సంచారం మీన రాశిలో ఈ నెల 24వరకు కొనసాగుతుంది.

  1. వృషభం: ఈ రాశివారికి లాభ స్థానంలో బుధ, రాహువుల సంచారం వల్ల తప్పకుండా ఆకస్మిక ధన లాభా నికి అవకాశముంటుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న వ్యవహారాలు, పనులు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. ఎప్పుడో రావలసిన పదోన్నతి, పెరగవలసిన ఇంక్రిమెంట్లు ఇప్పుడు చేతికి వచ్చే సూచనలున్నాయి. మిత్ర వర్గంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వం నుంచి కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం కుదుటపడడం ప్రారంభమవుతుంది.
  2. మిథునం: ఈ రాశికి పదవ స్థానంలో బుధ, రాహువుల వక్రగతి వల్ల ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. అంచనాలకు మించి జీతభత్యాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పదోన్నతులకు కూడా అవకాశముంది. విభిన్న రంగా లకు చెందిన ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని సానుకూల పరిణామాలు సంభవిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జీవనశైలే మారే అవకాశం ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో రెండు గ్రహాలు వక్రంగా సంచారం చేస్తున్నందువల్ల, ఆర్థికంగా బాగా తక్కువ స్థాయిలో ఉన్నవారు సైతం వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితిలో తప్ప కుండా అభివృద్ధి ఉంటుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. ఏది జరిగినా ఊహించని విధంగానే జరిగే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశివారికి సప్తమ స్థానంలో బుధ, రాహువుల వక్ర సంచారం వల్ల పెండింగులో ఉన్న శుభ కార్యాలు ఇప్పుడు చోటు చేసుకుంటాయి. వదిలేసుకున్న పెళ్లి సంబంధాలు ఇప్పుడు మళ్లీ అంది వస్తాయి. ఊహించని విధంగా ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. భాగస్వాములతో విభేదాలు పరిష్కారమై, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. అనుకోని ఆదాయ వృద్ధి ఉంటుంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో రెండు గ్రహాలు వక్రగతి పట్టడం ఈ రాశివారి జీవనశైలిలో సమూ లమైన మార్పులు తీసుకు వస్తుంది. గృహ వాతావరణం మారిపోతుంది. అనేక సౌకర్యాలతో ఇంటి పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో విలాసాలు పెరుగుతాయి. కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లి వచ్చే అవకాశముంది. వాహన యోగం పడుతుంది. ఆస్తి సమస్య పరిష్కారం అవుతుంది. ఊహించని విధంగా ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.
  6. మీనం: ఈ రాశిలో రెండు గ్రహాలు వక్రగతి పట్టడం వల్ల తప్పకుండా జీవన శైలి మారుతుంది. అలవాట్లు, ప్రవర్తనలో కూడా మార్పువస్తుంది. వ్యక్తిగత సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. అను కోని విధంగా ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సాధారణ జీవితం నుంచి ఉన్నత స్థాయి జీవితానికి ఎదగడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడుతుంది.