Women Astrology: అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!

స్త్రీ గ్రహమైన శుక్రుడు మహిళల పక్షపాతి. స్వస్థానంలో ఉన్నా, ఉచ్ఛలో ఉన్నా తప్పకుండా మహిళల ప్రాధాన్యం, ప్రాభవం పెంచే రాజయోగాలను కలిగిస్తాడు. ప్రస్తుతం శుక్ర గ్రహం మీన రాశిలో ఉచ్ఛలో ఉన్నందువల్ల వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు చెందిన మహిళలను ఉన్నత స్థానాల్లో నిలబడే అవకాశముంది.

Women Astrology: అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
Women Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 16, 2024 | 5:15 PM

స్త్రీ గ్రహమైన శుక్రుడు మహిళల పక్షపాతి. స్వస్థానంలో ఉన్నా, ఉచ్ఛలో ఉన్నా తప్పకుండా మహిళల ప్రాధాన్యం, ప్రాభవం పెంచే రాజయోగాలను కలిగిస్తాడు. ప్రస్తుతం శుక్ర గ్రహం మీన రాశిలో ఉచ్ఛలో ఉన్నందువల్ల వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు చెందిన మహిళలను ఉన్నత స్థానాల్లో నిలబడే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, ఆదాయం, సంపద, ఆస్తి, గృహ, వాహనాల పరంగా కూడా ఈ రాశులకు చెందిన మహిళలను అభివృద్ధిలోకి తీసుకు రావడం జరుగుతుంది. ఈ రాశికి చెందిన మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం పడుతుంది. మీన రాశిలో ఉన్న శుక్రుడు ఈ నెల 24న మేష రాశిలోకి మారే వరకూ మహిళలకు దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంటుంది.

  1. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ పట్టినందువల్ల, ఈరాశికి చెందిన మహిళలు ఏ రంగంలో ఉన్నప్పటికీ, చివరికి గృహిణిగానే ఉన్నప్పటికీ వారి ప్రాధాన్యం పెరుగు తుంది. వీరు తమ తమ రంగాల్లో తప్పకుండా రాణిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ముందుకు వస్తాయి. వృత్తి జీవితం విస్తరిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టినందువల్ల, ఈ రాశికి చెందిన మహిళలకు అనేక విధాలుగా అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరు ద్యోగులు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగాలు సంపాదించుకుంటారు. విదేశీ యానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలున్నాయి. ఆధ్యా త్మికంగా కూడా పురోగతి చెందుతారు. ఇష్టమైన పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్ల లకు సంబంధించి శుభవార్తలు వింటారు. శుభ కార్యాలు జరిగే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు తప్పకుండా అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో మంచి ఉద్యోగం లభిస్తుంది. సంపన్న లేదా ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామా జికంగా కూడా హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు తక్కువ ప్రయత్నంతో మంచి ఆఫర్లు అందు తాయి. ఉద్యోగులు మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరే సూచనలున్నాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  5. కుంభం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశ ముంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశి మహిళల మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పదో న్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం, పొదుపు లేదా మదుపు చేయడం వంటివి కూడా జరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు చోటు చేసు కుంటాయి. పెళ్లి సంబంధాలు ఖాయమవుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి.
  6. మీనం: ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు ప్రాభవం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ రాశివారే ప్రముఖుల స్థాయికి ఎదిగే సూచనలు కూడా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధన లాభం కలుగుతుంది. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. ప్రజాదరణ పెరుగుతుంది. వీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం పడుతుంది. సంపన్న వ్యక్తితో లేదా పలుకుబడి కలిగన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.