Horoscope Today: వారి ఆదాయం బాగా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): మేష రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులన్నిటినీ నిదానంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయంటే..

Horoscope Today: వారి ఆదాయం బాగా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today 17th April 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 17, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): మేష రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులన్నిటినీ నిదానంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. చేపట్టిన పనులన్నిటినీ నిదానంగా పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులు కొన్ని ముఖ్యమైన ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాల్ని అందుకుంటారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం పరవా లేదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్య మైన అవసరాలు తీరిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటుతనంతో వ్యవహరించ వద్దు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం రొటీనుగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే సూచనలు న్నాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశముంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. ప్రయాణాలు, పరిచయాల వల్ల కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీది బండిలా సాగిపోతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశ ముంది. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సొంత పనులు, వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగు లకు బాధ్యతలు, పనిభారం పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. జాగ్ర త్తగా ఉండడం మంచిది. పిల్లల విజయాల గురించి శుభవార్తలు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఆర్థిక ఫలితాలుంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాం తంగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ప్రముఖులతో సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభ రణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా పెరుగుతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యానికి భంగం ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబం వ్యవహారాలు చక్కబడతాయి. కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యక్తిగతంగా ఒకటి రెండు ఆందోళనకర సమస్యల నుంచి బయటపడతారు. లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులను చురుకుగా పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్యో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం మీద, విశ్రాంతి మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వేధించే అధికారులు నిష్క్రమిస్తారు. ఆస్తి వ్యవహారం ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో పని భారంతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరు గుపడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదం విష యంలో బంధువుల నుంచి ఒత్తిడి ఉంటుంది. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ సమా చారం అందుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందు తాయి. మాట తొందరపాటు వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభవార్తలు వినడం జరుగు తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సౌకర్యాలను పెంచుకుంటారు. తలపెట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్ని ఉత్సాహంగా నిర్వర్తిస్తారు. అనేక విధాలుగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టు కుం టారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.