Malavya Yoga: ఈ నెల 24 ఏర్పడనున్న మాళవ్య రాజ్యయోగం.. ఆ 5 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..
అతి త్వరలోనే శుక్రగ్రహం మీన రాశి నుంచి మేష రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. అంటే ఏప్రిల్ 24వ తేదిన శుక్రగ్రహం మేష రాశిలో అడుగు పెట్టనున్నాడు. దీంతో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. శుక్రుడు మేష రాశిలోకి అడుగు పెట్టిన తర్వాత ఐదు రాశుల వారు ఊహించని లాభాలు అందుకుంటారు. వృత్తి పరంగా ఎన్నో శుభ వార్తలు వింటారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రంలో రాశులకు, నవ గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవ గ్రహాల్లో శుక్ర గ్రహం సంపదనిచ్చే గ్రహంగా భావిస్తారు. అంతేకాదు ప్రేమ, వివాహం, అందం , అన్ని ప్రాపంచిక సౌకర్యాలను అందించే గ్రహంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం ప్రత్యేక కదలిక వలన కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి. ఈ గ్రహం మీన రాశిలో సంచరించనున్నాడు. అంతేకాకుండా అతి త్వరలోనే శుక్రగ్రహం మీన రాశి నుంచి మేష రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. అంటే ఏప్రిల్ 24వ తేదిన శుక్రగ్రహం మేష రాశిలో అడుగు పెట్టనున్నాడు. దీంతో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. శుక్రుడు మేష రాశిలోకి అడుగు పెట్టిన తర్వాత ఐదు రాశుల వారు ఊహించని లాభాలు అందుకుంటారు. వృత్తి పరంగా ఎన్నో శుభ వార్తలు వింటారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారికి మాళవ్య రాజయోగం ఊహించని లాభాలను అందిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు. నాలుగు విధాలుగా డబ్బును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి పరంగా పురోగతిని పొందుతారు. అంతేకాదు చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ యోగం అన్నింటా శుభాలను తెస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనేక శుభవార్తలను వింటారు. అంతేకాదు కొత్త భూములు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారికీ కలిసి వచ్చి పట్టిందల్లా బంగారంగా మారుతుంది.
తులా రాశి: ఈ రాశికి చెందిన వారికి కూడా ఈ మాళవ్య రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్టం వీరి సొంతం. కెరీర్‌కి సంబంధించిన పనులను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్థులు ఆర్ధికంగా లాభాలను అందుకుని డబ్బును పొందుతారు. అంతేకాదు ఉద్యోగస్థులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు మాళవ్య రాజ్యయోగం శుభ ప్రదంగా ఉండనుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఆఫర్స్ లభిస్తాయి. అంతే కాదు ప్రేమికుల జీవితంలో సంతోషము నెలకొంటుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
మీన రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ యోగం అన్నీ శుభాలను ఇస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ప్రేమ ఫలించి పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు