Sri Ramanavami: శ్రీరామ నవమి రోజున రామయ్యకు నైవేద్యంగా పానకం, వడపప్పు .. దీని వెనుక శాస్త్రీయ కోణం ఏమిటంటే

శ్రీ రామ నవమి రోజున రామయ్యకు ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండగకు దేవుళ్ళకు సమర్పించే నైవేద్యాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో రామ నవమి రోజున శ్రీ రామయ్యకు పానకం, వడపప్పు ను సమర్పించి తర్వాత వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. దీని వెనుక ఆధ్యాత్మిక కారణం మాత్రమే కాదు.. శాస్త్రీయ కోణం ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం.. 

Sri Ramanavami: శ్రీరామ నవమి రోజున రామయ్యకు నైవేద్యంగా పానకం, వడపప్పు .. దీని వెనుక శాస్త్రీయ కోణం ఏమిటంటే
Sri Rama Navami 2024
Follow us
Surya Kala

|

Updated on: Apr 16, 2024 | 2:50 PM

మానవుడిగా పుట్టి నడకతో, నడతతో దైవంగా మారి ప్రజలతో పూజలను అందుకుంటున్నాడు శ్రీ రాముడు. హిందువుల ప్రతి ఇంట్లో శ్రీ రాముడు మొదటి బిడ్డగా భావిస్తారు. అటువంటి జగదభి రాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమి. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఆ సేతు హిమాచలం శ్రీ రామ నవమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. రాములోరి భక్తులు రామ నవమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు. మర్నాడు పట్టాభిషేకం జరిపిస్తారు. అయితే శ్రీ రామ నవమి రోజున రామయ్యకు ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండగకు దేవుళ్ళకు సమర్పించే నైవేద్యాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో రామ నవమి రోజున శ్రీ రామయ్యకు పానకం, వడపప్పు ను సమర్పించి తర్వాత వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. దీని వెనుక ఆధ్యాత్మిక కారణం మాత్రమే కాదు.. శాస్త్రీయ కోణం ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం..

ఆధ్యాత్మిక ప్రకారం  శ్రీ రామ చంద్రుడికి బెల్లం అంటే ఇష్టమని.. వనవాసం చేస్తున్న సమయంలో సీతారాములు లక్ష్మణుడు తమ ఆహారంగా పండ్లతో పాటు అడవిలో దొరికే మూలికలతో పానకం తయారు చేసుకుని తీసుకునేవారట. అంతేకాదు ఋషులు రామయ్యకు వడపప్పుని నైవేద్యంగా సమర్పించేవారట.. దీంతో రామ నవమికి వడపప్పు, పానకం సమ్పరించే సంప్రదాయం మొదలైంది అని చెబుతారు.

నైవేద్యంలో శాస్త్రీయ కోణం ఏమిటంటే.. 

ఇవి కూడా చదవండి

శ్రీ రామ నవమి వేడుక వేసవి కాలంలో వస్తుంది. దీంతో బెల్లంతో చేసిన పానకం తాగడం వలన శరీరానికి చలువ జేస్తుంది. పానకంలో కలిపే యాలకులు, మిరియాల పొడి జీర్ణక్రియను మెరుగు పరిచే గుణాలను కలిగి ఉంటాయి.

వడపప్పు గా పెసర పప్పుని చేస్తారు. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.

వడపప్పు, పానకం తయారు చేయడం చాలా ఈజీ. తక్కువ పదార్ధాలను ఉపయోగంచి తక్కువ సమయంలోనే వీటిని తయారు చేసుకోవచ్చు..

 పానకం తయారీకి కావాల్సిన పదార్ధాలు..

  1.  బెల్లం – తురిమిన బెల్లం
  2. యాలకుల పొడి -1 టీస్పూన్
  3. మిరియాల పొడి- 1 టీస్పూన్
  4. శొంఠి పొడి – కొంచెం
  5. నిమ్మరసం – కొంచెం
  6. నీరు – ఒక లీటరు

పానకం తయారు చేసే విధానం:  ఒక గిన్నె తీసుకుని దానిలో ముందుగా నీరు పోసుకోవాలి. తర్వాత తురిమిన బెల్లం వేసి కరిగే వరకూ గరిటెతో కలపండి. తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి, శొంఠి పొడి వేసి బాగా కలిపి చివరిగా నిమ్మరసం వేసి కలపాలి. అంతే బెల్లం పానకం రెడీ.. చల్లగా ఉండాలి అనుకునే వారు ఆ పానకంలో ఐస్ క్యూబ్స్ ను వేసుకోవచ్చు.

వడపప్పు తయారీ..

  1. కావాల్సిన పదార్ధాలు
  2. పెసర పప్పు
  3. పచ్చి మిర్చి
  4. ఉప్పు
  5. నిమ్మరసం

తయారీ విధానం: పెసర పప్పు ని శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి. పెసర పప్పు నానిన తర్వాత నీటిని తీసివేసి అందులో కొంచెం ఉప్పు, దంచిన పచ్చి మిర్చి , నిమ్మ రసం వేసి కలుపుకోవాలి. అంతే వడపప్పు తయారవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..