Interesting Facts: కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే!

ఆడవారైనా.. మగవారైనా ఎప్పుడైనా మీ కాళ్ల వేళ్లను గమనించారా? కొందరికి కాళ్ల వేళ్లు సమానంగా ఉంటే.. మరికొందరికి మొదటి రెండు లేదా మూడు సమానంగా ఉంటాయి.. చివరివి చిన్నగా ఉంటాయి. కానీ బొటని వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉంటే.. అందరి మీదా పెత్తనం చెలాయిస్తారని, స్త్రీలు.. భర్త నోరును తెరవనివ్వరని, పెద్ద గయ్యాళి అని, అలాగే మగవాళ్ల కూడా భార్యపై పెత్తనం చేస్తాడని అంటూ ఉంటారు. ఇంతకీ మరి ఇది నిజమేనా? దీనిపై జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో..

Interesting Facts: కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే!
Interesting Facts
Follow us

|

Updated on: Apr 16, 2024 | 3:51 PM

ఆడవారైనా.. మగవారైనా ఎప్పుడైనా మీ కాళ్ల వేళ్లను గమనించారా? కొందరికి కాళ్ల వేళ్లు సమానంగా ఉంటే.. మరికొందరికి మొదటి రెండు లేదా మూడు సమానంగా ఉంటాయి.. చివరివి చిన్నగా ఉంటాయి. కానీ బొటని వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉంటే.. అందరి మీదా పెత్తనం చెలాయిస్తారని, స్త్రీలు.. భర్త నోరును తెరవనివ్వరని, పెద్ద గయ్యాళి అని, అలాగే మగవాళ్ల కూడా భార్యపై పెత్తనం చేస్తాడని అంటూ ఉంటారు. ఇంతకీ మరి ఇది నిజమేనా? దీనిపై జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి పాదాల ఆకారం చూసి మీరు ఎలా ఉంటారో చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. మీ వ్యక్తిత్వ లక్షణాలతో.. పాదాల ఆకారానికి దగ్గర సంబంధం ఉంటుందట.

అన్ని వేళ్లూ సమానంగా..

మీ కాలి వేళ్లు అన్నీ సమానంగా ఉంటే.. మీరు చాలా నమ్మకమైన వ్యక్తి అని అర్థం. మీకు ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పొచ్చు. అలాగే జీవితంలో కష్టపడే వ్యక్తి అని కూడా అర్థం. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

మొదటి మూడు వేళ్లు సమానంగా ఉంటే..

కాలి వేళ్లల్లో మొదటి మూడు వేళ్లు సమానంగా ఉండి.. మిగిలిన రెండు మాత్రం చిన్నగా ఉంటే.. మీదీ రోమన్ పాదం అని అంటారు. ఇలాంటి ఆకారం ఉన్నవాళ్లు అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఇతరుల పట్ల దయతో ఉంటారు. త్వరగా అందరితో కమ్యూనికేషన్ అయిపోతారు. అలాగే లైఫ్‌లో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు.

ఇవి కూడా చదవండి

కాలి బొటన వేలు పొడుగ్గా ఉంటే..

కాలి బొటన వేలు మాత్రం పొడుగ్గా ఉండి.. మిగిలిన వేళ్లు చిన్నగా ఉంటే.. మీది.. ఈజిప్షియన్ ఫుట్ అని అంటారు. మీరు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. మొండిగా ఉంటూ.. మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు. అలాగే నమ్మకమైన వ్యక్తులు.

బొటన వేలి కంటే పక్కన వేలు పొడుగ్గా ఉంటే..

ఇక చివరిగా.. బొటన వేలి కంటే పక్కన వేలు పొడుగ్గా ఉంటే.. మీది గ్రీకు పాదం అని అర్థం. ఈ పాదం ఆకారం ఉన్నవారు.. చాలా ఎమోషనల్ పర్సన్. అందరికీ త్వరగా కనెక్ట్ అయిపోతారు. అందరితో స్నేహంగా ఉంటారు. చాలా శక్తివంతంగా, సృజనాత్మకంగా ఉంటారు. జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఆల్ ది బెస్ట్.. T20 ప్రపంచకప్‌ కోసం USA వెళ్లిన టీమిండియా..వీడియో
ఆల్ ది బెస్ట్.. T20 ప్రపంచకప్‌ కోసం USA వెళ్లిన టీమిండియా..వీడియో
ఆధార్ కార్డులో తప్పులున్నాయా.. ఇలా ఇంట్లో నుంచే ఈజీగా..
ఆధార్ కార్డులో తప్పులున్నాయా.. ఇలా ఇంట్లో నుంచే ఈజీగా..
వాహనదారులకు రవాణా శాఖ షాక్.. ఏకంగా రిజిస్ట్రేషన్ల రద్దు !
వాహనదారులకు రవాణా శాఖ షాక్.. ఏకంగా రిజిస్ట్రేషన్ల రద్దు !
తెలంగాణ 10th సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల: డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ 10th సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల: డైరెక్ట్ లింక్ ఇదే
ఫస్ట్ బ్యాటింగ్‌కే పిచ్‌ అనుకూలం..! ఫైనల్ ఫైట్‌లో గెలుపెవరిదీ..
ఫస్ట్ బ్యాటింగ్‌కే పిచ్‌ అనుకూలం..! ఫైనల్ ఫైట్‌లో గెలుపెవరిదీ..
ఛాతీలో దిగిన బాణం.. ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన NIMs వైద్యులు
ఛాతీలో దిగిన బాణం.. ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన NIMs వైద్యులు
పెళ్లి చేసుకోకపోవడమే సమస్య కావచ్చు.. అందుకే ఇలా జరిగింది..
పెళ్లి చేసుకోకపోవడమే సమస్య కావచ్చు.. అందుకే ఇలా జరిగింది..
బిస్కెట్ కంపెనీకి జరిమానా విధించిన అధికారులు.. కారణం ఏంటో తెలుసా.
బిస్కెట్ కంపెనీకి జరిమానా విధించిన అధికారులు.. కారణం ఏంటో తెలుసా.
తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు కుండబోత.. బలమైన ఈదురుగాలులు!
తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు కుండబోత.. బలమైన ఈదురుగాలులు!
మీ వాట్సాప్ డీపీని AI తయారు చేస్తే ఎలా ఉంటుందో చూస్తారా?
మీ వాట్సాప్ డీపీని AI తయారు చేస్తే ఎలా ఉంటుందో చూస్తారా?