Aeroplane: విమానం గాల్లో ఉండగా ఢీకొన్న పక్షి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
విమానాల్లో గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు పక్షుల ఢీకొనడం.. ఆ తర్వాత విమానానికి ప్రమాదం చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ అమెరికన్ విమానాన్ని పక్షి ఢీకొనడంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
విమానాల్లో గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు పక్షుల ఢీకొనడం.. ఆ తర్వాత విమానానికి ప్రమాదం చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ అమెరికన్ విమానాన్ని పక్షి ఢీకొనడంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజున బోయింగ్ 737 విమానం గాల్లో వెళ్తుండగా ఒక్కసారిగా పక్షి ఢీకొంది. దీంతో ఆ విమానం ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన పైలెట్లు ఒహియోలోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
విమానంలో వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని.. పైలెట్లు తమకు పక్షిని ఢీకొన్నామని చెప్పినట్లు ఆ విమానంలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఆ తర్వాత తాము సురక్షితంగా ల్యాండ్ అయ్యామని పేర్కొన్నాడు. అనంతరం వారందరిని ఫ్లైట్ నుంచి దించాక వేరే ఫ్లైట్‌లో తరలించినట్లు తెలిపాడు. అయితే ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్పందించింది. ఫ్లేట్ సేఫ్‌గా ల్యాండ్ అయిందని ఎవరకీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించింది. విమానం ఇంజన్ కు మంటలు వచ్చే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
@FAANews I just saw AA1958 with major engine issues just after take off. Flames shooting from the engine and wonky, pulsing noises from the aircraft.
— CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.