AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: ఫోన్‌ చూస్తూ ట్రైన్‌ నడిపిన మహిళ.. కళ్లు మూసి తెరిసేలోపు బూమ్‌..

ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండే పరిస్థితి వచ్చింది. తినేప్పుడు, పడుకునేప్పుడు చివరికి బాత్‌రూమ్‌లో ఉన్నా స్మార్ట్‌ ఫోన్‌ వాడుతోన్న రోజులివీ. ఇక మరికొందరైతే ఏకంగా డ్రైవింగ్ చేసే సమయంలోనూ ఫోన్‌ను చూస్తున్నారు...

Viral video: ఫోన్‌ చూస్తూ ట్రైన్‌ నడిపిన మహిళ.. కళ్లు మూసి తెరిసేలోపు బూమ్‌..
Viral Video
Narender Vaitla
|

Updated on: Apr 23, 2023 | 6:43 PM

Share

ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండే పరిస్థితి వచ్చింది. తినేప్పుడు, పడుకునేప్పుడు చివరికి బాత్‌రూమ్‌లో ఉన్నా స్మార్ట్‌ ఫోన్‌ వాడుతోన్న రోజులివీ. ఇక మరికొందరైతే ఏకంగా డ్రైవింగ్ చేసే సమయంలోనూ ఫోన్‌ను చూస్తున్నారు. ఇలా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. అయితే తాజాగా ఓ మహిళ ఏకంగా ట్రైన్‌ నడిపిస్తూ రైలు నడిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన 2019లో రష్యాలో జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఇడియట్స్‌ అనే ట్వి్ట్టర్‌ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో ఓ మహిళా లోకో పైలట్‌ ట్రైన్‌ను నడిపిస్తోంది. అదే సమయంలో ఎంచక్కా స్మార్ట్‌ ఫోన్‌ను ఆపరేట్ చేస్తోంది. ఎదురుగా ఎలాంటి రైళ్లు రావన్న ధీమాతో రయ్యిమని దూసుకుపోయింది. అయితే అంతలోనే ఒక్కసారిగా అదే ట్రాక్‌పై మరో రైలు దూసుకొచ్చింది. దీంతో చివరి క్షణంలో విషయాన్ని గమనించిన లోకోపైలట్‌ చేతిలో ఉన్న ఫోన్‌ను పడేసి ట్రైన్‌ను ఆపడానికి శతవిధాలా ప్రయత్నించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

వేగంగా దూసుకెళ్లిన రైలు ఎదురుగా ఉన్న రైలును ఢికొట్టింది. అయితే సీటు బెల్టు ధరించడం, రైలు అత్యాధునిక సాంకేతికతో రూపొందించడం కారణంగా లోకో పైలట్‌ పెద్దగా గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడింది. రైల్లో ఉన్న సీసీటీవీలో ఇదంతా రికార్డ్‌ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇక రైళ్లో వెనకా బోగీల్లో కూర్చున్న ప్రయాణికులు కూడా ఒక్కసారిగా ఎగిరిపడుతోన్న వీడియోలు భయంకరంగా ఉన్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి