SRT50: ‘దేవుడా ఈ ఫొటో చూడండి’ అంటూ అభిమాని ట్వీట్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన లిటిల్ మాస్టర్..

Sachin Tendulkar Birthday: 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ రేపటితో (ఆగస్టు 24) 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఓ అభిమాని స్పెషల్‌గా ప్లాన్ చేశాడు.

SRT50: 'దేవుడా ఈ ఫొటో చూడండి' అంటూ అభిమాని ట్వీట్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన లిటిల్ మాస్టర్..
Sachin Birth Day
Follow us
Venkata Chari

|

Updated on: Apr 23, 2023 | 6:50 PM

Sachin Birthday Special: ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ (Sachin Tedulkar).. తన వృత్తి జీవితం నుంచి రిటైర్ అయినప్పటికీ.. ఇప్పటికీ తన అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నాడు. ఇప్పటికీ సచిన్ అనే పేరు వినిపిస్తే.. అభిమానుల్లో ఓ తెలియని వైబ్రేషన్స్ కనిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు చక్కటి ఉదాహరణగా ఈ వీడియో సోషల్‌ నెట్‌వర్క్‌లో వైరల్‌గా మారింది. అభిమానుల ప్రేమను మెచ్చుకుంటూ సచిన్ టెండూల్కర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో రీ-ట్వీట్ చేయడం విశేషం.

‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ రేపటితో (ఆగస్టు 24) 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఓ అభిమాని స్పెషల్‌గా ప్లాన్ చేశాడు. క్రికెట్ దేవుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ.. చేతిపై ఓ టాటూ వేయించుకున్నాడు. అది కూడా సచిన్ పాకిస్తాన్‌పై ఆడుతూ.. బ్యాట్ పట్టుకుని నిల్చున్న ఫొటోను టాటూగా వేయించుకున్నాడు. ఈ ఫొటో, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘దయచేసి నా పచ్చబొట్టు చూడండి దేవుడా..’ అంటూ క్యాష్టన్ రాశాడు.

ఇవి కూడా చదవండి

ఈ అభిమాని కోరికను సచిన్ టెండూల్కర్ వెంటనే తీర్చాడు. ఈమేరకు ట్విట్టర్‌లో స్పందించాడు. ’10/10! అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరలవుతోంది.

100 సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించిన సచిన్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. రిటైర్మెంట్ తర్వాత సచిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. పోస్ట్‌లను షేర్ చేస్తూ.. అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా పనిచేస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..