IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్‌న్యూస్.. దూరం కానున్న స్టార్ ఆల్ రౌండర్..
IPL 2023: బెన్ స్టోక్స్‌ను రూ. 17 కోట్లకు CSK కొనుగోలు చేసింది. కానీ, ఈ ప్లేయర్ వల్ల చెన్నై టీంకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో CSKకి ఇది నాల్గవ విజయం. దీంతో ప్లేఆఫ్‌లు ఆడేందుకు మార్గం సులభమైంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ కూడా తెరపైకి వచ్చింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తదుపరి కొన్ని మ్యాచ్ ల్లో ఆడే అవకాశం లేదు.
బెన్ స్టోక్స్ ఫిట్‌నెస్‌పై CSK ఎటువంటి అధికారిక అప్‌డేట్ ఇవ్వలేదు. బెన్ స్టోక్స్ పూర్తి ఫిట్‌గా లేడని మీడియా కథనాల్లో వస్తోంది. ఇంగ్లీష్ వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బెన్ స్టోక్స్ పూర్తి ఫిట్‌గా ఉండటానికి మరో వారం పడుతుందంట. బెన్ స్టోక్స్ కనీసం మరో రెండు మ్యాచ్‌ల కోసం CSK ఆడే 11లో భాగం కాలేడని స్పష్టమైంది.
బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 17 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే, ఈ ప్లేయర్ సీఎస్‌కేకి ఏమాత్రం ఉపయోగపడేలా కనిపించడం లేదు. ఐపీఎల్ 16లో స్టోక్స్ ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో స్టోక్స్ బ్యాట్ విఫలమవడంతో అతను 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గాయం కారణంగా, స్టోక్స్ కూడా బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు.
స్టోక్స్ ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లే ఛాన్స్..
ప్లేఆఫ్‌కు ముందు బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరుపున టెస్టు ఆడటమే తన ప్రాధాన్యత అని బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు. జూన్‌లో జరగనున్న యాషెస్ సిరీస్‌కు సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని స్టోక్స్ ఐపీఎల్‌ను మధ్యలో వదిలేసి ఇంగ్లండ్‌కు వెళ్లవచ్చని తెలుస్తోంది.
స్టోక్స్ ఆడకపోయినా సీఎస్‌కే జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేదు. 6 మ్యాచ్‌లు ఆడిన CSK నాలుగింటిలో విజయం సాధించింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు కాన్వే, రితురాజ్, రహానే, శివమ్ దూబేలు ఈ సీజన్‌లో CSK తరపున అనూహ్యంగా రాణిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..