Asia Cup 2023: భారత్ మ్యాచ్‌లన్నీ ‘హైబ్రిడ్ మోడల్’లోనే.. ప్రతిపాదించిన పాకిస్థాన్.. వివాదాలు ముగిసినట్టేనా?
India vs Pakistan: ఆసియా కప్ 2023 నిర్వహించడం పాకిస్థాన్‌కు వివాదాంశంగా మారింది. BCCI ఆసియా కప్ 2023 కోసం పాకిస్తాన్‌లో పర్యటించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత జట్టు మ్యాచ్‌ల కోసం హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది.
ఆసియా కప్ 2023 నిర్వహించడం పాకిస్థాన్‌కు వివాదాంశంగా మారింది. BCCI ఆసియా కప్ 2023 కోసం పాకిస్తాన్‌లో పర్యటించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత జట్టు మ్యాచ్‌ల కోసం హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించింది. ఇందులో పాకిస్థాన్ తన మ్యాచ్‌లను సొంతగడ్డపై ఆడనుంది. భారత జట్టు మాత్రం తటస్థ వేదికపై ఆడుతుంది.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. గోవాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఇటువంటి పరిస్థితిలో తన భారతదేశ పర్యటన ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయకరంగా ఉంటుందని నజామ్ సేథీ భావిస్తున్నాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని మాకు చెప్పారు. 2025లో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే జరిగితే.. భారత్ పాకిస్థాన్ పర్యటనకు అంగీకరించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
మీడియాను ఉద్దేశించి సేథీ మాట్లాడుతూ, “ఆసియా కప్‌ను తటస్థ వేదికలో నిర్వహించాలని, ప్రపంచ కప్ కోసం భారత పర్యటనకు వెళ్లాలని మాకు సలహా ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..