CM KCR: హైదరాబాద్‌లో బసవ భవన్ నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు.. సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడికి సీఎం కేసీఆర్ నివాళి..

హైదరాబాద్ కోకాపేటలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవ భవన్ నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటేననే బసవేశ్వరుని సమతా..

CM KCR: హైదరాబాద్‌లో బసవ భవన్ నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు.. సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడికి సీఎం కేసీఆర్ నివాళి..
CM KCR
Follow us

|

Updated on: Apr 23, 2023 | 9:34 PM

సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు, నాటి కాలం ప్రజా నాయకుడు బసవేశ్వరుని జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్​లు, లింగ బలిజలు ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) శుభాకాంక్షలు తెలిపారు. వారు జాతికి చేసిన సేవలను, బోధనలను స్మరించుకున్నారు సీఎం కేసీఆర్. ఆ నాటి సమాజంలో నెలకొన్న మత చాంధస విలువలను సంస్కరిస్తూ.. సాంఘీకదురాచారాల మీద పోరాటం చేయడమే కాకుండా, వర్ణ వివక్ష, కుల వివక్ష, లింగ వివక్ష లేని సమాజం కోసం దాదాపు 900 ఏళ్ల క్రితమే పోరాడిన సామాజిక దార్శనికుడు బసవేశ్వరుడని సీఎం కేసీఆర్ కొనియాడారు.

అప్పట్లో సమాజంలో నెలకొని ఉన్న మత విలువలను సంస్కరించడమే కాకుండా సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన బసవేశ్వరుడు సామాజిక దార్శనికుడని ముఖ్యమంత్రి కొనియాడారు. బసవేశ్వరుడు ‘అనుభవ మంటపం’ వ్యవస్థను నెలకొల్పారని, అందులో అన్ని కులాలకు ప్రాతినిథ్యం ఉందని సీఎం చెప్పారు.

ఆ రోజుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి బీజాలు నాటిన దార్శనికత కలిగిన నాయకుడు కేసీఆర్ అన్నారు. బసవేశ్వరుని జయంతిని ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ.. వారి ఆశయాల సాధన దిశగా కార్యాచరణ చేపట్టిందని సీఎం తెలిపారు. బసవేశ్వరుని స్పూర్తిని రేపటి తరాలు కొనసాగించేందుకు గుర్తుగా వారి కాంస్య విగ్రహాన్ని ట్యాంకుబండ్ మీద నెలకొల్పుకున్నమని చెప్పారు.

హైదరాబాద్‌లోని కోకాపేట్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవ భవన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని ఆ ప్రకటనలో తెలిపారు. భవిష్యత్ తరాలకు బసవేశ్వరుడి స్ఫూర్తిని కొనసాగించేందుకు చిహ్నంగా ట్యాంక్ బండ్‌పై బసవేశ్వరుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా సమానమేనన్న బసవేశ్వరుడి దార్శనికతను ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం అన్నారు. దళిత, వెనుకబడిన కులాలు, గిరిజనులు, మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తూ బసవేశ్వరుడి ఆశయాలను కొనసాగిస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Latest Articles