AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వార్నర్ మామ.. సన్‌రైజర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ.. తుది జట్టు వివరాలివే..

IPL 2023, SRH vs DC: తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగానే జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండే గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

IPL 2023: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వార్నర్ మామ.. సన్‌రైజర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ.. తుది జట్టు వివరాలివే..
Srh Vs Dc, Ipl 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 24, 2023 | 6:55 AM

Share

IPL 2023, SRH vs DC: తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగానే జరిగే ఈ ఐపీఎల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండే గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్‌లకు ఒక విజయంతో 10 స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వరుస విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని డేవిడ్ వార్నర్ సేన చూస్తోంది. వీటికి తోడు గతంలో సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన వార్నర్.. ఇప్పుడు అదే టీమ్‌పై రాణించాలని చూస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ఎంతో చేరువైన వార్నర్ నాయకత్వంలోనే సన్‌రైజర్స్ టీమ్ 2016లో ఐపీఎల్  కప్ సాధించింది.

ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్‌పై సన్‌రైజర్స్ వేటు వేసి సమర్థ్ వ్యాస్‌ను టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన స్థానాలలో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. ఇక టీమ్ ఓపెనర్ హ్యరీ బ్రూక్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి మిడిలార్డర్ల నుంచి కూడా మంచి నాక్ రావాల్సి ఉంది. అలాగే టీమ్‌లో భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ వంటి బలమైన బౌలర్లు ఉన్నా, వికెట్లు తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ పరిస్థితి పూర్తిగా వేరేలా ఉంది. ఆ టీమ్ నుంచి కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు చేసేందుకు కూడా మొహమాటపడుతున్నారు. కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ వంటి బౌలర్లతో బౌలింగ్ పటిష్టంగానే ఉన్నా బ్యాటర్లు రాణించాల్సి ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఉన్న రికార్డ్ పరంగా చూస్తే ఢిల్లీ టీమ్‌పై హైదరాబాద్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 21 సార్లు తలపడిన ఈ జట్లలో హైదరాబాద్ 11, ఢిల్లీ 10 విజయాలు సాధించింది.

ఇవి కూడా చదవండి

SRH vs DC తుది జట్టు వివరాలు(అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్‌, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్

ఢిల్లీ క్యాపిటల్స్ (DC): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..