కెరీర్‌లో 23 సెంచరీలు మిస్.. ఓ ఏడాదిలో 3 సార్లు 99 పరుగుల వద్ద ఔట్.. అయినా, బౌలర్లకు పీడకలే.. ఎవరో తెలుసా?
Sachin Tendulkar Records: చిన్నవయసులోనే క్రికెట్‌ను తన జీవితంగా మార్చుకున్న సచిన్ రమేష్ టెండూల్కర్.. ఆటలో బలమైన ఆటగాడిగా ఎదిగాడు. ప్రపంచం అంతా తన వైపు చూసేలా, తనే ఓ శక్తిగా మారాడు. షేన్ వార్న్ వంటి గొప్ప బౌలర్‌ను కలలోనూ వెంటాడమే కాదు..
క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ ప్రపంచానికి మకుటం లేని రాజుగా నిలిచాడు. ఎదురుగా ఎవరున్నా వెనకడు వేయడు. అందర్నీ భయపెడుతూ.. రికార్డులకే రారాజుగా మారాడు. 22 గజాల స్థలంలో నిర్భయంగా నిలిచి, గెలిచాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలు అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ కాలంలో ఎన్నో రికార్డులు ప్రపంచానికి పరిచయం చేశాడు. కానీ, ఈ రికార్డుల పరంపరలో 23 సెంచరీలు కూడా మిస్సయ్యాడు. ఆయనెవరో కాదు టీమిండియా దిగ్గజ ప్లేయర్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. ఎందరికో ఆదర్శంగా, మరెందరినో ఆటలోకి తీసుకొచ్చేలా ప్రేరేపించిన సచిన్.. నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని రికార్డులను చూద్దాం..
చిన్నవయసులోనే క్రికెట్‌ను తన జీవితంగా మార్చుకున్న సచిన్ రమేష్ టెండూల్కర్.. ఆటలో బలమైన ఆటగాడిగా ఎదిగాడు. ప్రపంచం అంతా తన వైపు చూసేలా, తనే ఓ శక్తిగా మారాడు. షేన్ వార్న్ వంటి గొప్ప బౌలర్‌ను కలలోనూ వెంటాడమే కాదు.. అబ్దుల్ ఖాదిర్ చితక బాదిన తీరుతో.. తన జీవితాంతం సచిన్‌ను గుర్తుంచుకుంటానంటూ చెప్పుకొచ్చేలా చేశాడు మన భారత దిగ్గజం.
24 ఏళ్ల కెరీర్, ఖాతాలో 100 సెంచరీలు..
సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 100 సెంచరీలు సాధించాడు. అంటే అతని పేరుతో సెంచరీల సెంచరీని నమోదు చేశాడు. ప్రపంచంలో ఈ స్థాయికి చేరుకున్న ఏకైక ఆటగాడు సచిన్ కావడం విశేషం. సచిన్ సాధించిన ఈ 100 సెంచరీల్లో 51 సెంచరీలు టెస్టు క్రికెట్‌లోనే ఉన్నాయి. అదే సమయంలో వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు.
View this post on Instagram
అంతర్జాతీయ క్రికెట్‌లో 23 సార్లు సెంచరీ మిస్సయ్యాడు..
వందల సెంచరీల ప్రపంచ రికార్డు నెలకొల్పిన సచిన్.. 23 సెంచరీలు కూడా మిస్ అయ్యాడు. అతని అంతర్జాతీయ కెరీర్‌లో సెంచరీకి చేరువైనా, సాధించలేకపోయిన 23 సార్లు ఇలా జరిగింది. అంటే 90 ప్లస్ స్కోరుతో ఔటయ్యాడన్నమాట.
వన్డేల్లో ఒకే సంవత్సరంలో 3 సార్లు 99 పరుగుల వద్ద ఔట్..
23 అంతర్జాతీయ సెంచరీలు మిస్సయ్యాయి. వాటిలో మూడు సెంచరీలు 99 పరుగుల వద్ద ఔటైనవే కావడం గమనార్హం. వన్డే క్రికెట్‌లో లిటిల్ మాస్టర్ విషయంలో ఇదే జరిగింది. 2007లో 99 స్కోరు వద్ద మూడుసార్లు ఔటయ్యాడు.
View this post on Instagram
అయితే, ఇన్ని సెంచరీలు మిస్ అయిన తర్వాత కూడా సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లో మకుటం లేని చక్రవర్తిగా మారాడు. ఇటువంటి బెంచ్‌మార్క్‌ను సెట్ చేసి, యువ ఆటగాళ్లకు ఓ ప్రేరణగా నిలిచాడు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని టీవీ9 తెలుగు కోరుకుంటోంది. హ్యాపీ బర్త్ డే క్రికెట్ గాడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..