Mercury Combust: అదృష్టమంటే ఈ రాశులదే.. అష్టైశ్వర్యాలను తీసుకొస్తున్న గ్రహాల రాకుమారుడు..

Mercury Combust In Aries: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పేర్కొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు సంపద, తెలివితేటలు, వాక్కు, వ్యాపారానికి అధిపతి. ఎవరికైనా తమ జాతక చక్రంలో బుధుడు ఉంటే వారికి నిశితమైన బుద్ధిజ్ఞానం, మంచి మాటకారితనం..

Mercury Combust: అదృష్టమంటే ఈ రాశులదే.. అష్టైశ్వర్యాలను తీసుకొస్తున్న గ్రహాల రాకుమారుడు..
Mercury Combust In Aries
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 23, 2023 | 1:32 PM

Mercury Combust In Aries: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పేర్కొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు సంపద, తెలివితేటలు, వాక్కు, వ్యాపారానికి అధిపతి. ఎవరికైనా తమ జాతక చక్రంలో బుధుడు ఉంటే వారికి నిశితమైన బుద్ధిజ్ఞానం, మంచి మాటకారితనం, ఆర్థికబలం లభిస్తాయి. ఇంకా వ్యాపారంలోకి దిగినవారు బుధగ్రహ కృపతో పెద్ద వ్యాపారవేత్తగా స్థిరపడగలరు. అయివంటి ప్రయోజనాలను కలిగించే బుధుడు ఏప్రిల్ 23న అంటే ఆదివారం రాత్రి మేషరాశిలో తిరోగమించనున్నాడు. అయినప్పటికీ కొన్నిరాశులవారికి బలమైన ఆర్థికాభివృద్ధి, ఉన్నత స్థాయితో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తించనున్నాయి. మరి మేషరాశిలో బుధగ్రహ తిరోగమనం వల్ల లాభపడనున్న ఆ అదృష్టరాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

మేషరాశి: మేషరాశిలోనే బుధుడు తిరోగమించడంతో ఈ రాశివారికి శుభఫలితాలు లభిస్తాయి. కెరీర్‌లో పురోగతి, వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగవ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భారీ లాభాలను పొందడంతో పాటు ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతారు. ఇంకా ఈ సమయంలో మేషరాశివారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

మిధునరాశి: మిథునరాశికి బుధుడే స్వయంగా అధిపతి కావడం వల్ల ఈ రాశి వారికి ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మేషరాశిలో బుధుడు ప్రవేశించినా, ఆ రాశి నుంచి నిష్క్రమించినా మిథున రాశివారికి బుధుడు శుభఫలితాలను అందిస్తాడు. ఫలితంగా మిధున రాశివారు తాము ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొంది, ధన ప్రవాహాన్ని అనుభవిస్తారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలు తమ పోటీదారులకు గట్టి పోటీనిచ్చి విజయం సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

కన్య రాశి: మేషరాశిలోకి బుధుడి తిరోగమనం కన్యారాశి జాతలకులకు గౌరవప్రతిష్టలను తెచ్చి పెడుతుంది. చేసిన ప్రతి కష్టానికి మీరు ఈ సమయంలో అద్భుతమైన రీతిలో ఫలితాలు పొందుతారు. అలాగే పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు మొత్తంలో లాభాలను గడిస్తారు. మీరు ఈ సమయంలో సమయస్ఫూర్తితో, మాట నేర్పరితనంతో విలసిల్లుతారు.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో