Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Network: మంచి నీళ్ల ప్రాయంగా డేటా.. జియో యూజర్లు ఎంత డేటా వాడుతున్నరో తెలిస్తే కళ్ళు తెలేస్తారు..

Jio Network: ప్రతి నెలా 10 ఎక్సాబైట్ డేటాను ఉపయోగిస్తున్న జియో వినియోగదారులు సరికొత్త రికార్డును నెలకొల్పారు. అవును, జియో వినియోగదారులు ఒక నెలలో 10 ఎక్సాబైట్(వంద కోట్ల GB) డేటాను వినియోగించారు. ఇంటర్నెట్ డేటా వినియోగంలో ఇది చాలా ఎక్కువ మొత్తం. ఓ సారి ఆలోచించండి.. 2016లో..

Jio Network: మంచి నీళ్ల ప్రాయంగా డేటా.. జియో యూజర్లు ఎంత డేటా వాడుతున్నరో తెలిస్తే కళ్ళు తెలేస్తారు..
Jio Users Using 10 Exabyte Data in a month
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 23, 2023 | 12:53 PM

Jio Network: ప్రతి నెలా 10 ఎక్సాబైట్ డేటాను ఉపయోగిస్తున్న జియో వినియోగదారులు సరికొత్త రికార్డును నెలకొల్పారు. అవును, జియో వినియోగదారులు ఒక నెలలో 10 ఎక్సాబైట్(వంద కోట్ల GB) డేటాను వినియోగించారు. ఇంటర్నెట్ డేటా వినియోగంలో ఇది చాలా ఎక్కువ మొత్తం. ఓ సారి ఆలోచించండి.. 2016లో ‘జియో నెట్‌వర్క్’ టెలికాం మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు భారతదేశ డేాలా వినియోగం 4.6 ఎక్సాబైట్‌లు. అది కూడా పూర్తి సంవత్సర కాలం వినియోగం. కానీ ఒక నెలలోనే ఒకే టెలికాం కంపెనీ అందిస్తున్న డేటా వినియోగం 10 ఎక్సాబైట్‌లను దాటడం ఇదే మొదటిసారి. ఇంకా ‘జియో’ పట్ల వినియోగదారుల ఆదరణకు ఇదే ఉదాహరణ. మార్చితో ముగిసిన ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొత్తం డేటా వినియోగం 30.3 ఎక్సాబైట్‌(303 కోట్ల GB)గా ఉంది. ఇందులోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ తన త్రైమాసిక ఫలితాలతో పాటు ఈ ఫలితాలను పంచుకుంటోంది.

దేశంలో ఇంటర్నెట్ డేటా వినియోగం పెరగడంలో జియో ట్రూ 5జీ కీలక పాత్ర పోషించింది. జియో వినియోగదారులు ప్రతి నెలా కనీసం 23.1 GB డేటాను వినియోగిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఈ వినియోగం 13.3 GBగా ఉంది. అంటే ఇప్పుడు ప్రతి జియో కస్టమర్ కూడా ఒక నెలలోనే 10GB అదనపు డేటాను వినియోగిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టెలికాం ఇండ్రస్ట్రీలోని జియో ప్రత్యర్థులతో పోలిస్తే ‘జియో నెట్‌వర్క్‌’ డేటా సేవల వినియోగం ఎక్కువగా ఉంది.

Data Usage

ఇవి కూడా చదవండి

తాజా త్రైమాసిక ఫలితాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పంచుకున్న గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 3,50,000 కంటే ఎక్కువ  5G సెల్‌‌లను 60,000 సైట్‌లలో జియో ఇన్‌స్టాల్ చేసింది. ఇప్పటి వరకు జియో ట్రూ 5G భారతదేశంలోని 2,300 పట్టణాలు, నగరాలలో తన సేవలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G రోల్‌అవుట్. 2023 చివరి నాటికి భారతదేశ వ్యాప్తంగా 5G సేవలను విస్తరింపజేస్తామని కంపెనీ ఇప్పటికే హామీ ఇచ్చింది.

5G రోల్‌అవుట్‌తో పాటు, జియో ఎయిర్‌ఫైర్‌బర్‌ను కూడా రాబోయే కొద్ది నెలల్లోనే ప్రారంభించబోతోంది ‘జియో నెట్‌వర్క్’. ఈ క్రమంలో ఫైబర్, ఎయిర్‌ఫైబర్‌తో 10 కోట్ల ఇళ్లకు జియో సేవలు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు మరికొన్ని ఆసక్తికరమైన వివరాలను కూడా వెల్లడించాయి. జియోని వినియోగించడం వల్ల ప్రతి కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం నెలకు రూ.178.8 కి పెరిగింది. అలాగే జియో వినియోగదారులు ప్రతిరోజూ 1,459 కోట్ల వాయిస్ మినిట్స్‌ని ఉపయోగిస్తున్నారు. అంటే జియో సేవలను పొందిన ప్రతి వినియోగదారు ఒక నెలలోనే 1,003 నిమిషాల పాటు కాల్ మాట్లాడున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం. ఇక్కడ క్లిక్ చేయండి..