AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Passion Plus: బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి మార్కెట్లోకి రానున్న ‘ఫ్యాషన్‌ ప్లస్‌’ బైక్‌

మార్కెట్లో వాహనాల విషయం పోటీ నెలకొంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్ది కొత్త కొత్త బైక్‌లు, కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అదనపు ఫీచర్స్‌ను పొందుపర్చి కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక ద్విచక్ర వాహనాల విషయంలో అదే జరుగుతోంది. రోజురోజుకు కొత్త కొత్త బైక్‌లు..

Passion Plus: బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి మార్కెట్లోకి రానున్న 'ఫ్యాషన్‌ ప్లస్‌' బైక్‌
Hero Passion Plus
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2023 | 2:20 PM

మార్కెట్లో వాహనాల విషయం పోటీ నెలకొంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్ది కొత్త కొత్త బైక్‌లు, కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అదనపు ఫీచర్స్‌ను పొందుపర్చి కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక ద్విచక్ర వాహనాల విషయంలో అదే జరుగుతోంది. రోజురోజుకు కొత్త కొత్త బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.  తాజాగా హీరోకు గట్టి పోటీని ఇచ్చేందుకు హోండా సరికొత్త 100ccషైన్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. హోండా సేల్స్ ని నిలువరించేందుకు హీరో సంస్థ దీనిని తీసుకువచ్చినట్లు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక హోండాకు పోటీగా హీరో మోటోకార్ప్ లో మంచి మార్క్ ని సాధించిన ప్యాషన్ ప్లస్ బైక్‌ను తీసుకువస్తుంది. కొత్త ఫీచర్లతో బీఎస్6 నిమయాలకు అనుగుణంగా దీనిని సంస్థ రూపొందించింది. హీరో ప్యాషన్ ప్లస్ రీ-లాంచ్‌తో హోండాకు చెక్ పెట్టినట్లు అవుతుందని హీరో మోటోకార్ప్ భావిస్తోంది.

అయితే హీరో ప్యాషన్ ప్లస్ 2019లో సంస్థ నిలిపివేసింది. తాజాగా దీనిని మళ్లీ ప్రవేశ పెడుతుండటంతో వాహనదారుల్లో మరింత ఆసక్తి రేపుతోంది. ప్యాషన్ సిరీస్ మోడల్ లో100ccలో దీనిని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాహనానికి సంబంధించి ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. సాధారణ ప్యాషన్, ప్యాషన్ ప్రో 110cc ఆఫర్లలో అందుబాటులో ఉండేవి. Passion Plus ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకుంది. దీనిని బుక్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ లైన్ 100cc, ఎగ్జిక్యూటివ్ లైన్ 110cc, 125cc ఎగ్జిక్యూటివ్ లైనప్‌లో 160cc, 200cc మోటార్ సైకిళ్లు ఉన్నాయి.

ఇప్పటి వరకు స్ప్లెండర్ అనేది ప్రాక్టికల్ లైన్‌లో అత్యంత ఖరీదైన ఆఫర్‌గా కొనసాగుతోంది. Hero Passion Plus రాకతో ఇకపై ఆ స్థానాన్ని ఆక్రమించనుంది. 100cc ఇంజన్‌ కొంచెం ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ ఫీచర్లతో ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. ఇకపై 100సీసీ కేటగిరీలో హీరో మోటోకార్ప్ మూడు విభిన్న మోడళ్లను అందించనుంది. అవి HF, Splendor Plus Passion Plusలు ఈ మోడళ్లలో అందుబాటులో ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు పరంగా హీరో ప్యాషన్ ప్లస్ హీరో ప్రాక్టికల్ లైన్‌ ఫ్లాగ్‌షిప్‌కి తగినట్లుగా ఉండనున్నాయి. ప్యాషన్ ప్లస్ 97.2సీసీ ఇంజన్‌తో రానుంది. ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద 7.91 బిహెచ్‌పి మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయనుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్ యూనిట్‌ను పొందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి