AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఇక్కడ ఎస్‌బీఐ బ్యాంకు ఏడాదిలో 4 నెలలు మాత్రమే ఓపెన్‌ ఉంటుంది.. కారణం ఏంటో తెలుసా..?

సాధారణంగా బ్యాంకులకు ప్రతి నెలలో కొన్ని సెలవులు ఉంటాయి. ఆ సమయాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ముఖ్యంగా పండగలు, ప్రముఖుల జయంతి, వర్థంతి, అలాగే రెండో శనివారాలు, ఆదివారాలలో బ్యాంకులకు సెలవు..

SBI: ఇక్కడ ఎస్‌బీఐ బ్యాంకు ఏడాదిలో 4 నెలలు మాత్రమే ఓపెన్‌ ఉంటుంది.. కారణం ఏంటో తెలుసా..?
SBI
Subhash Goud
|

Updated on: Apr 22, 2023 | 3:47 PM

Share

సాధారణంగా బ్యాంకులకు ప్రతి నెలలో కొన్ని సెలవులు ఉంటాయి. ఆ సమయాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ముఖ్యంగా పండగలు, ప్రముఖుల జయంతి, వర్థంతి, అలాగే రెండో శనివారాలు, ఆదివారాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే భారతదేశంలో ఓ ప్రాంతంలో ఓ బ్యాంకు ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. అదేంటి బ్యాంకు నాలుగు, ఐదు నెలలు తెరిచి ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజం. ఆ బ్యాంకు కూడా పెద్ద భవనంలో ఉండదు. పూరి గుడిసెలో మాత్రమే ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అసలు అది ఏ బ్యాంకు, ఎక్కడ ఉంటుంది..? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇది శాఖను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నడిపిస్తోంది. ఈ బ్యాంకు ఇండో-చైనా బార్డర్‌లో ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని గుంజి గ్రామంలో ఉంటుంది. ఈ బ్యాంకును మానససరోవర్ యాత్రికులు, ఇండో-చైనా వాణిజ్యంలో పాల్గొనే వ్యాపారులు ఎక్కువగా వినియోగిస్తుండే వాళ్లు. అయితే, ప్రస్తుతం.. బార్డర్‌లో తలెత్తుతున్న గొడవల కారణంగా ఈ బ్యాంకును పూర్తిగా మూసివేశారు అధికారులు. దాంతో గుంజి సహా చుట్టుపక్కల గ్రామాలన్నీ.. బ్యాంక్ సేవలకోసం పక్క ఊరిలో ఉన్న బ్యాంకుకు వెళ్తున్నారు.

ఇంటర్నెట్‌ నిషేధం:

గుంజి గ్రామంలో ఇంటర్నెట్‌ను నిషేధించారు. అందుకు ఇక్కడి బ్యాంకు సేవలను నిలిపివేశారు. అయితే, ఇంటర్నెట్ బదులు సాటిలైట్ కమ్యూనికేషన్ వాడి బ్యాంకును నడిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బ్యాంకు సేవలు లేక ఇబ్బందులు పడుతున్నామని, పక్కనే ఉన్న ఊర్లోకి వెళ్లి బ్యాంకు సేవలు పొందాలంటే ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గ్రామస్తులు ఏమంటున్నారు..?

అయితే ఎస్‌బీఐ శాఖలో అన్ని సౌకర్యాలు అందుబాటులో లేవని గ్రామస్తులు చెబుతున్నారు. బ్యాంక్ జూన్ మొదటి వారంలో తెరిచి సెప్టెంబర్ చివరి నాటికి మూసివేయబడుతుంది. ఇక్కడ ఉన్న వ్యాపారులు, సైన్యం, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. ఇండో-చైనా వాణిజ్యంలో వ్యక్తులతో వ్యాపారం చేస్తాము.. వారు US డాలర్లలో మాకు వసూలు చేస్తారు. బ్యాంకు మూసివేయబడితే మేము తదనుగుణంగా డబ్బును మార్చుకోలేము అని అంటున్నారు.

Sbi Branch

Sbi Branch

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి