Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై అ‍త్యధిక ఇడ్డీ ఇచ్చే బ్యాంకులివే.. ఏకంగా 9.50శాతం వడ్డీ..

పలు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తు‍న్నాయి. సాధారణంగా ఎఫ్‌డీలపై 7 శాతం నుంచి వడ్డీ ప్రారంభమవుతుంది. అయితే కొన్ని బ్యాంకులు దాదాపు 9.50 శాతం వరకూ కూడా వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అటువంటి బ్యాంకులకు చెందిన ఎఫ్‌డీల గురించి ఎప్పుడు తెలుసుకుందాం.

Best FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై అ‍త్యధిక ఇడ్డీ ఇచ్చే బ్యాంకులివే.. ఏకంగా 9.50శాతం వడ్డీ..
Bank Fd
Follow us
Madhu

|

Updated on: Apr 22, 2023 | 4:00 PM

బ్యాంకులు లేదా పోస్టు ఆఫీసులు అందించే పొదుపు, పెట్టుబడుల పథకాలలో అత్యంత ప్రజాదరణ పొందినది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ). కచ్చితమైన రాబడితో పాటు ప్రభుత్వ భరోసా కూడా ఉండటంతో ప్రజల్లో దీనిపై అపార నమ్మకం ఏర్పడింది. అయితే ఈ ఎఫ్‌డీలపై అందించే వడ్డీ మాత్రం బ్యాంకులను బట్టి మారుతుంటుంది. కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తుంటాయి. అయితే ఇటీవల జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచుతాయని ఎదురుచూసిన వినియోగదారులకు నిరాశ తప్పలేదు. అయినప్పటికీ పలు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తు‍న్నాయి. సాధారణంగా ఎఫ్‌డీలపై 7 శాతం నుంచి వడ్డీ ప్రారంభమవుతుంది. అయితే కొన్ని బ్యాంకులు దాదాపు 9.50 శాతం వరకూ కూడా వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అటువంటి బ్యాంకులకు చెందిన ఎఫ్‌డీల గురించి ఎప్పుడు తెలుసుకుందాం.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ.. ఈ బ్యాంక్ 1001 రోజుల కాలవ్యవధితో ఎఫ్‌డీని అందిస్తోంది.ఈ ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 9.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అదే సమయంలో, సాధారణ పౌరులకు 9.00 శాతం వడ్డీని అందిస్తోంది.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ.. 888 రోజుల కాలవ్యవధితో ఉండే ఈ ఎఫ్‌డీపై సీనియర్‌ సిటిజన్‌లకు 9 శాతం వడ్డీ ఇస్తారు. అలాగే సాధారణ పౌరులకు రూ. 2కోట్లకంటే తక్కువ మొత్తం పెట్టుబడి పెడితే 888 రోజుల మెచ్యూరిటీ పీరియడ్‌తో ఉండే ఈ ఎఫ్‌డీపై 8.50శాతం వడ్డీ అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ.. ఈ బ్యాంకులో 700 రోజుల మెచ్యూరిటీ పీరియడ్‌తో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయొచ్చు. దీనిపై సీనియర్‌ సిటీజనులకు 9.00శాతం వడ్డీ రేటు అందిస్తారు. అలాగే సాధారణ పౌరులు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు 700 రోజుల మెచ్యూరిటీ పీరియడ్‌పై గరిష్టంగా 8.25శాతం వడ్డీ రేటును పొందవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ.. ఎస్‌బీఐ ఇప్పుడు అమృత్ కలష్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తోంది. జూన్ 30, 2023 వరకు దీనిని కొనసాగిస్తోంది. ఈ పథకం కింద, సీనియర్ సిటిజన్‌లు గరిష్ట వడ్డీ 7.60 శాతం పొందవచ్చు. అదే సాధారణ కస్టమర్లు అయితే 400 రోజుల మెచ్యూరిటీ పీరియడ్‌పై 7.10శాతం వడ్డీ రేటును పొందగలరు. ఇది కాక సాధారణంగా ఎస్‌బీఐ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలలోపు ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్‌లకు 7.50 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అదే సాధారణ ప్రజలకు అయితే రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ రేటును పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే