Andhra Pradesh: సైకో అనుదీప్.. ప్రేమిస్తున్నానని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాడు.. ఆ తర్వాత ఒప్పుకోలేదని..

ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో కాకినాడ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థినికి.. ఓ యువకుడు టార్చర్‌ పెట్టాడు. బలవంతం చేసేందుకు ప్రయత్నించడంతో యువతి ప్రతిఘటించింది.

Andhra Pradesh: సైకో అనుదీప్.. ప్రేమిస్తున్నానని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాడు.. ఆ తర్వాత ఒప్పుకోలేదని..
Ap Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 23, 2023 | 1:50 PM

ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో కాకినాడ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థినికి.. ఓ యువకుడు టార్చర్‌ పెట్టాడు. బలవంతం చేసేందుకు ప్రయత్నించడంతో యువతి ప్రతిఘటించింది. దీంతో గదిలో నిర్బంధించి.. వేడినూనె శరీరంపై పోసి టార్చర్‌ పెట్టాడు. ఈ దారుణ ఘటన ఏపీలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని శనివారపుపేటకు చెందిన ఓ విద్యార్థిని కాకినాడ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే, శనివారపుపేటకు సమీపంలోని దుగ్గిరాలకు చెందిన సదర్ల అనుదీప్‌ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం విద్యార్థినిని దుగ్గిరాలలోని తన ఇంటికి తీసుకుని వచ్చి చిత్రహింసలకు గురి చేశాడు. ఆమెను ఇంట్లోనే నిర్భంధించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. బలవంతం చేసేందుకు ప్రయత్నించడంతో యువతి ప్రతిఘటించడంతో వేడినూనె శరీరంపై పోసి టార్చర్‌ పెట్టాడు.

అయితే, గాయపడిన యువతి ఆదివారం తెల్లవారుజామున తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిత్రహింసలకు గురిచేసిన తర్వాత యువతిపై అత్యాచారం చేసినట్లు ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అనుదీప్‌ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..