Telangana: తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్.. మండే ఎండలకు బ్రేక్.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?

ఎండలకు బ్రేక్ పడింది. తెలంగాణలో చల్లని జల్లులు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు అకాల వర్షంతో కాస్త రిలీఫ్ దొరికింది. ఈ క్రమంలోనే కూల్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

Telangana: తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్.. మండే ఎండలకు బ్రేక్.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?
Telangana Weather Report
Follow us
Ranjith Muppidi

| Edited By: Basha Shek

Updated on: Apr 20, 2024 | 11:14 PM

ఎండలకు బ్రేక్ పడింది. తెలంగాణలో చల్లని జల్లులు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు అకాల వర్షంతో కాస్త రిలీఫ్ దొరికింది. ఈ క్రమంలోనే కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ కేంద్రం. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది ఐఎండీ. ఇక హైదరాబాద్‌లోనూ శనివారం ఉదయం నుంచి వాతారణం మారింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచాయి. హైదరాబాద్‌తో ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 12 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన భారీ వడగండ్ల వానకు భారీగా పంటనష్టం వాటిల్లింది. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణశాఖ. 50 నుంచి 60 కిలోమీట్లర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు. పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 19 రాత్రి నుంచే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరి, మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..