AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: ఎన్నికల ప్రచారంలో షారుఖ్ ఖాన్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

మరోవైపు ఫేజ్ 2 అభ్యర్థుల నామినేషన్ పత్రాల సమర్పణకు ఇవాళ చివరి రోజు. దీంతో పలువురు అభ్యర్థులు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రణితి షిండే ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను రంగంలోకి దింపారు.

Shah Rukh Khan: ఎన్నికల ప్రచారంలో షారుఖ్ ఖాన్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
Shah Rukh Khan
Basha Shek
|

Updated on: Apr 19, 2024 | 5:58 PM

Share

2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 102 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు ఫేజ్ 2 అభ్యర్థుల నామినేషన్ పత్రాల సమర్పణకు ఇవాళ చివరి రోజు. దీంతో పలువురు అభ్యర్థులు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రణితి షిండే ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను రంగంలోకి దింపారు. అయితే అతను ఒరిజినల్ కింగ్ ఖాన్ కాదు..డూప్. ప్రణితి షిండే ప్రచారంలో షారుఖ్ ఖాన్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రణితి షిండేను ప్రమోట్ చేయడానికి షారుఖ్ స్వయంగా ర్యాలీకి వచ్చారా? అని చాలా మంది ఆశ్చర్యపోయారు. అతని హావభావాలు, లుక్స్ సేమ్ టు సేమ్ కింగ్ ఖాన్ లాగా ఉన్నాయి. దీంతో అక్కడి జనాలందరూ అయోమయంలో పడ్డారు. అయితే అతను షారుఖ్ డూప్ అని తెలియడంతో ముక్కు మీద వేలేసుకున్నారు.

అందుకే షారుఖ్ డూప్‌ తో ప్రచారం..

ఈ ప్రచార సభకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షారుఖ్ ఖాన్ డూప్ బ్లాక్ టీ షర్ట్, జీన్స్ ధరించి స్టైలిష్ గా కనిపించాడు. అతని హెయిర్ స్టైల్, లుక్, హావభావాలు కూడా షారుక్ లానే ఉన్నాయి. కాగా ఈ ప్రాంతలో కింగ్ ఖాన్ కు బాగా అభిమానులు ఉన్నారని, అందుకే ప్రణతి షిండే ఈ ఎత్తుగడను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇలాంటి ట్రిక్స్ తో విజయం సాధించలేరంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

సినిమా పనుల్లో బిజీబిజీగా..

షారుక్ ఖాన్ ఏ రాజకీయ పార్టీతోనూ గుర్తింపు పొందలేదు. ప్రస్తుతం ఆయన తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ‘డంకీ’ సినిమా తర్వాత కొత్త సినిమా అనౌన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక షారుఖ్ పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ కూడా చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ తన కూతురు తదుపరి సినిమా కోసం 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.