AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav: దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్.. అభిమానుల ప్రశంసలు

. రజనీకాంత్, విక్రమ్, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు వివేక్‌ . తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వివేక్ మూడేళ్ల క్రితం గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు.

Vaibhav: దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్.. అభిమానుల ప్రశంసలు
Vaibhav Reddy
Basha Shek
|

Updated on: Apr 18, 2024 | 10:05 PM

Share

తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని నటుల్లో దివంగత కమెడియన్ వివేక్ కూడా ఒకరు. స్టార్ హీరోలకు ధీటుగా అభిమానుల్లో మంచి గుర్తింపు సాధించుకున్నారీ లెజెండరీ కమెడియన్. రజనీకాంత్, విక్రమ్, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు వివేక్‌ . తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వివేక్ మూడేళ్ల క్రితం గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. శుక్రవారం (ఏప్రిల్ 19) ఆయన మూడో వర్ధంతి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వివేక్ కు నివాళులు అర్పించారు. సినిమా రంగానికి వివేక్ అందించిన సేవలను స్మృతికి తెచ్చుకున్నారు. కాగా వివేక్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటుడు వైభవ్ రెడ్డి షూటింగ్‌ స్పాట్‌లో మొక్కలను నాటారు. ఆయనతో పాటు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు, ఎంజీఆర్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు కలిసి మొత్తం 100 మొక్కలను నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వివేక్ సంస్మరణ దినోత్సవం రోజున హీరో వైభవ్ చాలా మంచి పని చేశాడంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వివేక్ కు సామాజిక స్పృహ ఎక్కువ. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితో గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే బతికున్న సమయంలో తమిళ నాడు అంతటా వేలాది మొక్కలను నాటారు. ఇప్పుడిదే స్ఫూర్తితో మొక్కలు నాటి వివేక్ ను స్మరించుకున్నాడు హీరో వైభవ్. ప్రస్తుతం ఆయన తన సినిమా 27 వ సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ స్థానిక తరమణిలోని ఎంజీఆర్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతోంది. ఈ క్రమంలోనే వివేక్ వర్ధంతి రోజున షూటింగ్ స్పాట్ లోనే వైభవ్ మొక్కలు నాటారు.

ఇవి కూడా చదవండి

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వైభవ్ సూపర్ హిట్ మూవీ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.