Aadujeevitham OTT: బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడు జీవితం( ది గోట్‌లైఫ్). సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడు జీవితం( ది గోట్‌లైఫ్). సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2024లో మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఆడు జీవితం నిలవడం విశేషం. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆడు జీవితం కు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ మారిపోయిన తీరు, నటన అందరినీ మెప్పించింది. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం విశేషం. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న ఆడు జీవితం సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ. 30 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం.
ఈనేపథ్యంలో మే 10 నుంచి ఆడు జీవితం సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. సర్వైవల్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆడు జీవితం సినిమాలో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ది గోట్‌డేస్ అనే నవల ఆధారంగా యథార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు బ్లెస్లీ ఈ మూవీని తెరకెక్కించాడు.
ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్..
Watching #PrithvirajSukumaran in #TheGoatLife is like witnessing a master at work. His performance is so real that one can forget he is watching a movie—it’s like one is right there with Najeeb, rooting for him every step of the way. #Blessy Sir direction gives the film a soulful… pic.twitter.com/l5UjoCXCfg
— Amit Karn (@amitkarn99) April 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.