IPL 2024: పొమ్మని పొగ బెట్టారు.. కట్ చేస్తే 72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad: బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది

IPL 2024: పొమ్మని పొగ బెట్టారు.. కట్ చేస్తే 72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad
Follow us
Basha Shek

|

Updated on: Apr 16, 2024 | 8:34 AM

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad: బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. హైదరాబాద్ తరుపున ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ, ట్రావిడ్ హెడ్ లు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలాగే ఈ ఇద్దరు పవర్ ప్లేలోనే 76 పరుగులు సాధించారు. మరీ ముఖ్యంగా ట్రావిస్ హెడ్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన ​​హెడ్ మైదానంలో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది 4వ వేగవంతమైన సెంచరీగా నిలిచింది. అంతేకాదు ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా కూడా హెడ్ రికార్డు సృష్టించాడు. చివరకు హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

హెడ్ తర్వాత హెన్రిక్ క్లాసెన్ కూడా మెరుపు బ్యాటింగ్ ఆడి కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. నిజానికి, ఈ ఇద్దరు మాజీ RCB ఆటగాళ్లు. ఇప్పుడు అదే RCBపై మెరుపు బ్యాటింగ్ తో విరుచుకుపడడం ఇక్కడ గమనించదగ్గ విషయం. వీరిద్దరితో పాటు చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఐడెన్ మార్క్రామ్ 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అలాగే అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 37 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో జట్టు అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్.

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమరోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సుయాష్ ప్రభుదేసాయి, అనుజ్ రావత్, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, టి నటరాజన్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..