- Telugu News Photo Gallery Cinema photos Siddu Jonnalagadda's Till Square Movie Likely To Stream On Netflix From May 3rd
Tillu Square OTT: ఓటీటీలో టిల్లు స్క్వేర్! సిద్దూ 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్‌కు ఎప్పుడు రావొచ్చంటే?
స్టార్ బాయ్ సిద్దు జొన్నల గడ్డ, మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. సుమారు రెండేళ్ల క్రితం చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన డీజే టిల్లు సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
Updated on: Apr 14, 2024 | 10:05 PM

స్టార్ బాయ్ సిద్దు జొన్నల గడ్డ, మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. సుమారు రెండేళ్ల క్రితం చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన డీజే టిల్లు సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి అలియాస్ రాధిక కూడా టిల్లు స్క్వేర్ లో ఓ క్యామియో రోల్ పోషించింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే రూ. వంద కోట్లుకు పైగానే రాబట్టింది.

ఇదిలా ఉంటే టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరలవుతోంది.

టిల్లు స్క్వేర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మొదట ఏప్రిల్ నెలాఖరులో ఓటీటీలోకి వస్తుందని ప్రచారం నడిచింది.

అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం కానుందని టాక్. మే 3వ తేదీ లేకపోతే మే నాలుగో వారంలోగా టిల్లు స్క్వేర్ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉందని సమాచారం.