- Telugu News Photo Gallery 3000 songs and became a millionaire in 22 years, Do you know who that singer?
Star Singer: 3000 పాటలు పాడి 22 ఏళ్లలో కోటీశ్వరాలైంది.. ఆ స్టార్ సింగర్ ఎవరో తెలుసా
కేవలం 22 ఏళ్ల వయసులోనే తన అద్భుత గానంతో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది. నేడు ఆ సింగర్ అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఈ గాయని మరెవరో కాదు మనకు ఇష్టమైన శ్రేయా ఘోషల్
Updated on: Apr 15, 2024 | 10:54 AM

కేవలం 22 ఏళ్ల వయసులోనే తన అద్బుత గానం తో వేల కోట్ల సంపాదిస్తూ క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది. నేడు ఆ సింగర్ అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఈ గాయని మరెవరో కాదు మనకు ఇష్టమైన శ్రేయా ఘోషల్.

ఈ స్టార్ సింగర్ సంజయ్ లీలా భన్సాలీ చిత్రం దేవదాస్ కోసం మొదట పాటను పాడిందని, ఆ పాట తనకెంతో ఇష్టమట.

శ్రేయ తన 22 ఏళ్ల కెరీర్‌లో 5 జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. అదే సమయంలో ఈ బ్యూటీ 7 ఫిల్మ్‌ఫేర్, 10 ఫిల్మ్‌ఫేర్ సౌత్, 4 కేరళ స్టేట్ అవార్డులు, రెండుసార్లు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.

బాలీవుడ్ మీడియా ప్రకారం.. శ్రేయ హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, ఉర్దూ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళం మరియు తెలుగుతో సహా దాదాపు 20 భాషలలో పాటలు పాడారు. ఇందులో హిందీ పాటల సంఖ్య ఎక్కువ.

22 ఏళ్లుగా సినిమాల్లో పాటలు పాడుతున్న శ్రేయ నేడు దేశంలోనే అత్యంత ఖరీదైన గాయకురాలు. శ్రేయా ఘోషల్ 6 సంవత్సరాల వయస్సులో సంగీతంలో ఎంటర్ అయ్యింది. 17 సంవత్సరాల వయస్సులో తన మొదటి పాటను పాడింది. శ్రేయ ఇప్పటి వరకు 3 వేలకు పైగా పాటలు పాడింది.



