- Telugu News Photo Gallery Technology photos Nubia launching new smart phone Nubia flip 5g features and price details
Nubia Flip 5G: బడ్జెట్‌లో ధరలో తొలి ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు కూడా సూపర్
ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. సామ్‌సంగ్ మొదలు మోటోరోలా వరకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చాయి. అయితే ఇవన్నీ ఎక్కువ బడ్జెట్‌లో లాంచ్ అయినవే. కానీ తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ నుబియా మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Apr 15, 2024 | 10:34 AM

నుబియా అనే స్మార్ట్‌ఫోన్ కంపెనీ తాజాగా గ్లోబల్ మార్కెట్లోకి నుబియా ఫ్లిప్ పేరుతో ఫోల్డబుల్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత తక్కువ బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావడం విశేషం. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.

ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,500కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,000, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 42,600గా నిర్ణయించారు. ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4310 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఈ ఫోన్లో 6.9 ఇంఎస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. 1,188 x 2,790 పిక్సెల్స్ రిజల్యూజన్ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో సర్క్యూలర్ కెమెరా మోడల్‌ను అందించారు. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వరకు ఇందులో ఇచ్చారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, వైఫై, బ్లూటూత్ 5.2, ఎన్‌ఎస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు.




