RCB vs SRH: 37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. మనుషులా, రోబోట్‌లా భయ్యా.. 20 రోజుల్లోనే రికార్డ్ స్కోర్ బ్రేక్ చేశారుగా..

RCB vs SRH: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అనేక IPL రికార్డులను తిరగరాసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్‌గా రికార్డు సృష్టించింది.

RCB vs SRH: 37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. మనుషులా, రోబోట్‌లా భయ్యా.. 20 రోజుల్లోనే రికార్డ్ స్కోర్ బ్రేక్ చేశారుగా..
srh-slam-highest-ever-total-in-history-of-ipl-vs-rcb
Follow us
Venkata Chari

|

Updated on: Apr 16, 2024 | 9:16 AM

RCB vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరుగుల వర్షం కురిపించింది. IPL 2024లో కేవలం 20 రోజుల్లో తన రికార్డ్‌నే తానే బద్దలు కొట్టింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ (102), హెన్రిచ్ క్లాసెన్ (67), అబ్దుల్ సమద్ (37), ఐడెన్ మార్క్రామ్ (32) విజృంభణతో హైదరాబాద్ ఆర్‌సీబీ బౌలింగ్‌ను ధ్వంసం చేసి మూడు వికెట్లకు 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు కాగా, టీ20 క్రికెట్‌లో రెండో అతిపెద్ద స్కోరుగా నిలిచింది. అనంతరం బెంగళూరు జట్టు కేవలం 262 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా, బెంగళూరు జట్టు తరపున దినేష్ కార్తీక్ 83 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్‌ల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. అంతకుముందు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (62), విరాట్ కోహ్లి (42) శుభారంభం చేసినా భారీ లక్ష్యాన్ని బెంగళూరు అధిగమించలేకపోయింది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీకి ఇది ఆరో ఓటమి.

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్‌గా రికార్డు సృష్టించింది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.

నిజానికి, అదే ఎడిషన్‌లో, హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు చేసింది. IPL చరిత్రలో అత్యధిక పరుగులు (263 పరుగులు) చేసిన RCB రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 20 రోజుల్లోనే హైదరాబాద్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ లక్ష్యానికి ధీటుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా 200కు పైగా పరుగులు చేసినా.. ఆ జట్టు విజయ తీరాన్ని తాకలేకపోయింది. ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ 62 పరుగుల ఇన్నింగ్స్ ఆడితే, ఆర్సీబీ తరపున ఒంటరి పోరాటం చేసిన దినేశ్ కార్తీక్ 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇరుజట్లు కలిపి 37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు సాధించాయి.

కాగా, హైదరాబాద్ తరపున ఓపెనర్ అభిషేక్ శర్మ 22 బంతుల్లో 34 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ కేవలం 41 బంతుల్లో 102 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతనితోపాటు హెన్రిచ్ క్లాసెన్ కూడా 67 పరుగులు చేశాడు. చివర్లో ఐడెన్ మార్క్రామ్ 17 బంతుల్లో 32 పరుగులు, అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 37 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు ఇలా రెచ్చిపోవడంలో ఆర్సీబీ బౌలర్ల సహకారం ఎంతో ఉంది. ఇందులో పేస్‌మెన్ రీస్ టాప్లీ 4 ఓవర్లలో 68 పరుగులు ఇవ్వగా, లాకీ ఫెర్గూసన్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు.

యశ్ దయాల్ కూడా 4 ఓవర్లలో 51 పరుగులు ఇవ్వగా, వైశాక్ విజయకుమార్ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు. ఈ విధంగా, RCB నలుగురు పేసర్లు బౌలింగ్‌లో ఒక్కొక్కరు అర్ధ సెంచరీలు సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..