RCB vs SRH, IPL 2024: దినేశ్ కార్తీక్ అద్బుత ఇన్నింగ్స్ వృథా.. బెంగళూరుపై హైదరాబాద్ గెలుపు
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad: ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. తాజాగా బెంగళూరుపై గెలుపొంది హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. సోమవారం (ఏప్రిల్ 15) రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad: ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. తాజాగా బెంగళూరుపై గెలుపొంది హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. సోమవారం (ఏప్రిల్ 15) రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ట్రావిడ్ హెడ్ (102) సెంచరీకి తోడు క్లాసెన్ (67) అభిషేక్ శర్మ (34), అబ్దుల్ సమద్ (37 నాటౌట్), మార్‌క్రమ్ (32 నాటౌట్) బెంగళూరు బౌలర్లపై విరుచుకు పడ్డారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ (35 బంతుల్లో 83, 5 ఫోర్లు, 7 సిక్స్ లు) చెలరేగాడు. డుప్లెసిస్ (62), కోహ్లీ(42) ధాటిగా ఆడినా భారీ లక్ష్యం కావడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ 3, మార్కండే 2, నటరాజన్ ఒక్క వికెట్ తీశారు.
దినేశ్ కార్తీక్ అద్భుత పోరాటం.. అయినా..
You can never rule Dinesh Karthik out of the game 🙌
What a knock, What a player 🔝#RCBvSRH #TATAIPL #IPLonJioCinema | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/UHnsbtFheP
— JioCinema (@JioCinema) April 15, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమరోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
సుయాష్ ప్రభుదేసాయి, అనుజ్ రావత్, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, టి నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి
కోహ్లీ కిర్రాక్ ఇన్నింగ్స్..
King Kohli is on the prowl! 🔥#IPLonJioCinema #TATAIPL #RCBvSRH #IPLinKannada | @RCBTweets | @imVkohli pic.twitter.com/0D5jHMyX3k
— JioCinema (@JioCinema) April 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..