AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: మహాలక్ష్మి అడుగుపెట్టింది.. పాపతో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక.. వీడియో చూశారా?

టాలీవుడ్‌ రాక్ స్టార్ మంచు మనోజ్‌, మౌనిక దంపతులు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. శనివారం ( ఏప్రిల్‌ 13న) మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను మొదట మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది

Manchu Manoj: మహాలక్ష్మి అడుగుపెట్టింది.. పాపతో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక.. వీడియో చూశారా?
Manchu Manoj Family
Basha Shek
|

Updated on: Apr 14, 2024 | 8:22 PM

Share

టాలీవుడ్‌ రాక్ స్టార్ మంచు మనోజ్‌, మౌనిక దంపతులు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. శనివారం ( ఏప్రిల్‌ 13న) మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను మొదట మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. ‘దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి చిన్నారి దేవత వచ్చింది. మనోజ్, మౌనికకు కుమార్తె పుట్టిందని చెప్పడం మాకెంతో సంతోషంగా ఉంది. మేం పాపను ఎమ్‌ఎమ్‌ పులి (మంచు మనోజ్‌ పులి అయ్యుండొచ్చు) అని ముద్దుగా పిలుస్తున్నాం’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది మంచు లక్ష్మి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మనోజ్, మౌనిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మనోజ్ దంపతులు తమ బుజ్జి పాపను తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మౌనిక, పాప, ధైరవ్ తో కలిసి నేరుగా ఫిలిం నగర్‌లో ఉన్న తన ఇంటికి వచ్చేశారు.

మహాలక్ష్మిని తొలిసారి ఇంట్లోకి తీసుకుపోతున్న శుభ సందర్భాన హారతి ఇచ్చి పూలతో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ధైరవ్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. కాగా మంచు మనోజ్, మౌనిక గతేడాది మార్చిలో రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే మౌనికకు ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక కొన్ని నెలల క్రితం మౌనిక గర్భంతో ఉందన్న శుభవార్తను పంచుకున్నాడు మనోజ్. ఆ తర్వాత మౌనిక సీమంతం ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ఇక ఇప్పుడు పండంటి మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టడంతో మనోజ్, మౌనికల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి

ఇంటి దగ్గర పాపతో మనోజ్, మౌనిక దంపతులు.. వీడియో ఇదిగో..

మంచు లక్ష్మి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు