- Telugu News Photo Gallery KTR, Harish Rao, CM Stalin And Others Strongly Condemn The Attack On CM YS Jagan
CM Jagan: జగన్ త్వరగా కోలుకోవాలి.. సీఎంపై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు
విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ పై రాళ్ల దాడి కలకలం రేపుతోంది. శనివారం (ఏప్రిల్ 13) రాత్రి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా ఆయనపై రాళ్ల దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిపై జరిగిన ఈ దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ముక్తఖంఠంతో ఖండించారు.
Updated on: Apr 13, 2024 | 11:17 PM

విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ పై రాళ్ల దాడి కలకలం రేపుతోంది. శనివారం (ఏప్రిల్ 13) రాత్రి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా ఆయనపై రాళ్ల దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిపై జరిగిన ఈ దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ముక్తఖంఠంతో ఖండించారు.

CM Ys Jagan

అలాగే ఎలక్షన్ కమిటీ ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు కూడా జగన్ పై దాడిని ఖండించారు.

సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆకాంక్షించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకోవాలి' అని ట్వీట్ చేశారు స్టాలిన్.

కాగా సీఎం జగన్ పై దాడికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు బాధ్యత వహించాలంటున్నారు వైసీపీ మంత్రులు. వారి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.