- Telugu News Photo Gallery Technology photos Motorola launching new smart phone moto g64 5g features and price details
Moto G64 5G: మోటోరోలా నుంచి మరో స్టన్నింగ్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్ అంతే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలో ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. మోటో జీ64 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి రానుంది. లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 15, 2024 | 8:54 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలో మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. మోటో జీ64 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు నెట్టిం వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఏప్రిల్ 16వ తేదీన ఈ ఫోన్‌ను అధికారింగా ప్రకటించనున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డైమెన్సిటీ 7025 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేయనున్నారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ 120 హెచ్‌జెడ్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. అలాగే 240 హెచ్‌జెడ్ సాంప్లింగ్‌రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఇవ్వనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

ఈ ఫోన్‌లో 30 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ52 రేటింగ్ వాటర్ ప్రూఫ్, 3.5 ఎమ్‌ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆటమ్స్ వంటి ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌ను మింట్ గ్రీన్, పర్ల్ బ్లూ, ఐస్ లిలాక్ కలర్స్‌లో తీసుకురానున్నారు.




