లెనోవో ఐడియల్ ప్యాడ్ 3 ల్యాప్ టాప్ రూ.33990కు అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ పనితీరు, పోర్టబిలిటీ మధ్య చక్కటి సమతుల్యతను కలిగి ఉంటుంది. 11వ తరం ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8 జీబీ+512 జీబీ ఎస్ఎస్‌డీ ఆధారంగా పని చేస్తుంది. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో స్ట్రీమింగ్, డాక్యుమెంట్ వర్క్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే అదనపు 2 సంవత్సరాల వారెంటీ, 3 నెలల ఎక్స్ బాక్స్ గేమ్ పాస్ దాని విలువ ప్రతిపాదనను మరింత మెరుగుపరుస్తుంది.