Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: పథకం ప్రకారమే సీఎం జగన్‌పై రాళ్ల దాడి.. ఎడమ కంటికి తీవ్ర గాయం

విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగ్‌నగర్‌ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది

CM Jagan: పథకం ప్రకారమే సీఎం జగన్‌పై రాళ్ల దాడి.. ఎడమ కంటికి తీవ్ర గాయం
CM YS Jagan
Follow us
Basha Shek

|

Updated on: Apr 13, 2024 | 10:59 PM

విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగ్‌నగర్‌ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తుండగా పథకం ప్రకారమే రాళ్ల దాడి జరిగిందని సమాచారం. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసరడంతో రాయి వేగంగా వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకు తగిలింది. దీంతో కంటి దగ్గర వాపు వచ్చింది. వైద్యులు జగన్ కు ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స తర్వాత యధావిధిగా బస్సు యాత్ర కొనసాగుతోంది. కాగా ఈ ఘటనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది. కాగా ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. జగన్ పై దాడి జరిగిన ప్రాంతంలో ఒకవైపు పాఠశాల, మరోవైపు రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. మరోవైపు దాడి జరిగిన సమయంలో  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సీఎం జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే.. టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సీఎం జగన్ పై రాళ్ల దాడి.. లైవ్ వీడియో..

చంద్రబాబే దాడి చేయించారు.. వైసీపీ

అంతకు ముందు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర 14వ రోజు గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్‌ అయింది. నంబూరు నుంచి ప్రారంభమైన 14వ రోజు బస్సు యాత్ర.. కాజా టోల్‌గేట్‌, ఎన్‌ఆర్‌ఐ జంక్షన్‌ మీదుగా.. సీకే ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంది. అక్కడ చేనేత కార్మికులతో సీఎం జగన్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. మంగళగిరి విషయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో వైసీపీ చేనేత వర్గానికి పోటీ చేసే అవకాశం ఇస్తే.. డబ్బుతో గెలవాలని చంద్రబాబు, లోకేష్‌ చూస్తున్నారని ఆరోపించారు. ఇక.. చేనేత కార్మికులతో ముఖాముఖి తర్వాత జగన్‌ బస్సు యాత్ర కుంచనపల్లి బైపాస్‌ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకుంది. భోజన విరామం తర్వాత తాడేపల్లి బైపాస్‌ నుంచి వారధి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో.. విజయవాడ వారధి దగ్గర ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యకర్తలు, నేతలు.. సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. విజయవాడలో జగన్‌ బస్సుయాత్ర జనం పోటెత్తారు. ఏ సెంటర్‌లో చూసినా.. ఏ రోడ్డులో చూసినా.. జగన్‌ బస్సుయాత్రకు జనం నీరాజనం పట్టారు. విజయవాడ నగరంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వేలాది మంది కార్యకర్తలు.. జగన్‌ బస్సుకు ఇరువైపులా పరుగులు తీస్తూ.. జై జగన్‌ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్